Thursday, April 17, 2014

ఆదిపర్వము 1


  శుక్లామ్ భర ధరం విష్ణుం సే సి వర్ణం చతుర్భుజం
  ప్రసన్న వధనమ్ ధ్యాయేత్ సర్వ విగ్నోప శాంతయేత్  !!

వేదవ్యాసభగవానుడు ఈ జాతికి సూర్యుని వంటి వాడు.  నన్నయ్య గారు ఆయన ని వర్ణ న చేస్తూ, ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అదే మాట అంటారు,సంసారమనే టటువంటి చీకటి ని తొలగ తోయగాలిగి నటువంటి వాడు, ధర్మోప దేశం చేయ్యగాలిన వాడు, పురుషార్ధ సమన్వయాన్ని ఈ జాతికి అందించినటువంటి వాడు, వేదాన్ని విభాగం చేసినటువంటి వాడు, 18 పురాణములను ఈ జాతికి అందించినటువంటి వాడు, పంచమ వేదమైనటువంటి భారతాన్ని అందించిన వ్యాస భగవానుడు లేని నాడు, మొత్తం అంతా కటిక  చీకటి, అటువంటు మహానుభావుని యొక్క ఉచ్చిస్టమే  సమస్త వంగ్మయము. అటు వంటి మహానుభావుని యొక్క స్పర్శతో కూడుకున్నదై కేవలము ఆయనచేత రచింపబడినదే కాక మహాభారతం లో అనేక ఘట్టాలలో వేదవ్యాసుడు స్వయం గా మనకి కనపడతారు,
ఆయన కూడా ఆ కధా గమనమునందు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి గా నిలిచారు. భారతము యథార్థముగా జరిగినది.  ఇతిహాసము "ఇతి హా అసము" ఇది ఇలాగే జరిగినది, ఇది ఇంకొకలా జరిగినది కాదు. ఇలా జరగలేదని నువ్వు అనుకుoటు న్నా వేమొ, కాదు కాదు ప్రతి అక్షరము ఇందులో ఎలా  చెప్పామో అలాగే
జరిగినది.కాబట్టే శ్రీరామాయణ రచన యందు వాల్మీకి మహర్షి ఒక వ్యక్తి, ఆ కధా గమనం లో ఆయన కూడా తనవంతు ఆ వ్యక్తిత్వాన్ని అందులో పోషించి కధకి పూర్ణత్వాన్ని సాధించి పెట్టారు, అలాగే మహాభారత రచన చేసినటువంటి వేదవ్యసుడే మహాభారత కధా గమనంమందు కూడా ఒక గొప్ప స్థితి ని పొంది ఎప్పుడెప్పుడు కధా గమనము వైక్లవ్యము ను పొందు తుందో, అప్పుడప్పుడు  ధార్మికం మైనటువంటి  స్థితిలో మళ్ళి ఆ వంశముల కొనసాగింపులకి, ధర్మం నిలబడడానికి తనదైనటువంటి కృషి తనదైన సహాయం అందజేస్తూ ఒక వ్యక్తి గా కధా గమనం లో నిలబడినటువంటి స్థితి.
అందుకే వేద వ్యాస భగవానుడు లేని నాడు మహాభారతం కాదు, వేద విభాగములు కాదు, అష్టా దశ పురాణములు  కాదు, బ్రహ్మ సూత్రములు కాదు, ఇవేవి అందేటటువంటి అవకాశం లేదు. అందుకే గురు పూర్ణిమ అన్న పేరు తో ఆషాడ శు ద్ద పూర్ణిమ నాడు వ్యాస భాగావనుడ్ని మనం అందరం పూజ చేస్తాం.
అటువంటి మహానుభావుడై నటువంటి వ్యాసుడు, సంస్కృతం లో మహాభారతాన్ని ఇచ్చారు.
'మహాభారతం' అన్న మాట ఒక్క భారతానికి మాత్రమే అన్వయం. రామాయణానికి కానీ భాగవతానికి కానీ ఈ మహాత్ శబ్దాన్ని ప్రయోగం చెయ్యరు. ఎందు వలన అంటే భారతం అనే మాటలోనే  భారము అన్న మాట నిక్షేపింప బడి ఉన్నది. గ్రంధము శ్రీ రామాయణం కన్నా భాగవతం కన్నా విస్ప్రుతి పొందినటువంటి స్థితి ఉంటుంది. అనేకమైనటువంటి శ్లోకాలు నూరు వెయ్యి శ్లోకాలతో కూడుకున్నటువంటి మహోత్క్రు స్ట మైనటు వంటి ఇతిహాసము మహాభారతం, బరువు కి సంబందినంత వరకు అలాగే ఉంటుంది. 18 పర్వాలు. పర్వము అంటే కణుపు అని ఒక అర్థం. 18 పర్వములతో కూడుకున్నదై, కొన్ని వేలమంది వ్యక్తులు ఇందులో కనపడుతూ ఉంటారు.  ఎన్ని ఆఖ్యనములో ఎన్ని ఉపఖ్యనములో ప్రతి చిన్న విషయాన్నీ కూడా ఎక్కడా విస్మరించ కుండా అందచేస్తాడు వ్యాస భగవానుడు. ప్రతి దానివెనక ఒక్కటే ఆయన యొక్క ఉద్దేశ్యం స్పష్టం గా కనపడుతూ ఉంటుంది, ఈ జాతికి ధర్మాన్ని అందించాలి. భారతం అన్న గ్రంధం వెనుక ఉన్న విశేషం అదే.  అది భాహ్యo లో ఎంత పెద్ద గ్రంధమో లోపల సారాన్ని పరిశీలనం చేసినప్పుడు కుడా అంత పెద్ద గ్రంధమే. అందుకే పెద్దలైనటువంటి వారు ఒక మాట అంటూ ఉంటారు "అసలు మహాభారతం వినని వాడు, మహా భారతం చెప్పని వాడు , మహా భరతం చదవని వాడు విధ్వంసుడే కాడు ". ఎందుచేత అంటే వేదము ఎంత గహనమైనదో, వేదము స్వరం తో ఆ మంత్రాన్ని నేర్చుకోవాలి
ఆ ఉధర్త అను ఉధార్త స్వరః స్వరముతో గురువుగారిదగ్గర కూర్చొని గురుముఖతగా నేర్చుకున్నటు వంటి 
 వేదమంత్రములలో నిక్షేపింప బడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరం తో కూడిన మంత్రముల చేత ఈశ్వరుని ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మచారణము వలన ఈస్వరానుగ్రహమును పొంది తత్కారణము చేత జ్ఞానము కలగడం చేత అద్వైత సిద్ధి ని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించ గలిగిన వేదo ఎంత గొప్పదో ,
ఆ వేదముతొ సమానమైన స్థాయి లో వ్యాస భగవానుడు పంచమ వేదంగా మహాభారతాన్ని ఈలోకానికి అందించారు .
మహా భారత ప్రయోజనము కానీ రామాయణ ప్రయోజనము కానీ భాగవత ప్రయోజనం ఒక్కటే ధర్మాన్ని అందించాలి.
మహాభారత గ్రంధం ఇంట్లో ఉండటమే గొప్ప, మహాభారతాన్ని ముట్టుకోవటమే గొప్ప ,
మహాభారతం చదవడం గొప్ప ,అసలు మహా భారతం వినడం ఎంత గొప్పదో , ఎందుకు మహాభారతాన్ని ఆంధ్రీ కరింప బడాలని తాను అంతగా వేమ్పర్లాడు తున్నాడో రాజ రాజ నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పిన ఘట్టాని చదివితే అటువంటి మహా పురుష జననo జరిగి ఉండి ఉండక పోతే ఈ మహాభారతం ఆంధ్రీ కరింప బడి ఉండేది కాదు కదా , మహాభారతం కవిత్రయం ఆంధ్రీకరిస్తే మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు కాళి ఆ జాగా ఏర్పడినా కూడా పరమేస్వరాను గ్రహం గా దాన్ని ఆంధ్రీ కరింప చెయ్యాలనేటటు వంటి కృత నిశ్చయం కలిగినటువంటి రాజులు కాల క్రమం లో ఎప్పుడో ఒక సారి తళుక్కున ప్రభవించడం, అటువంటి రాజు ఉన్నపుడే అటువంటి గొప్ప కవి కూడా ఈశ్వరానుగ్రహం గా రావడం దేశ కాలములు సమకూడి నన్నయ్య ,తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురు త్రిముర్తులై ఆంధ్రీ కరించి , తెలుగు భాష కే  కొత్త గౌరవన్ని తెచ్చారు, తెలుగు జాతికే ఒక గొప్ప గౌరవన్ని తీస్కువచ్చారు.
 పంచమ వేదమైనటువంటి మహాభారతము ను ఆంధ్రీ కరింప చేయటం లో రాజరాజనరేంద్రుడు పడిన ఆర్తి చుస్తే మహాభారతం ఎంత గొప్ప గ్రంథం రా అనిపిస్తుంది. భారతాన్ని చదవటం ఎంత కష్టమో, భారతమ్ లో ఉండేటువంటి ధర్మ సమన్వయము చేసుకొని జీవితాన్ని అభ్యుదయ పధం లో నడిపిచుకోగాలిగినటువంటి స్థిత ప్రజ్ఞత ని పొందడం కూడా అంతే కష్టం.
మహా భారతం నిజంగా చదవగలిగితే, మహాభారతం లో చెప్పిన ధర్మం లో మనం ఏపాటి నిలబడ గలుగుతున్నాం అనిపిస్తుంది. ఈ జాతి గొప్పతనం అసలు ఎక్కడున్నదంటే, మతం అన్న పేరు జీవించేటటువంటి
విధానానికి లేదు. మతం అని పిలవం, దీన్ని సనాతన ధర్మమూ అని పిలుస్తాము,ధర్మమూ అన్న మాటకి అర్థం మీరు అనుష్టి చవలసినది, ఏది అనుస్టి చాలి ? అంటే నాకు తోచినది నేను మీకు తోచి నది  మీరు అను ష్టి చడం కాదు, ఏది మీరు నేనూ కూడా కాలముతో దేశముతో సంబంధం లేకుండా ఎప్పుడూ అందరు అనుస్టిoచి  తరించవలసి ఉంటుందో ఏది అనుస్టిoచడం చేత మారని సత్యమును మీరు ఎరుకలోకి తెచ్చుకోగలరో అలా ఆచరించవలసినటు వంటది ఆచార ఖాoడ గా వేదం లో చెప్పుకొస్తూ, జ్ఞానము పొందడానికి కావలసిన సోపానము ల నన్నిటినికి  ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదం గా నిలబడింది. అందుకే మిగిలిన మతాలకి ఏదో ఒక గ్రంధము ఆధారమై ఉండోచ్చు , ఆ గ్రంధ కర్త దానిని చేసిన వారై ఉండవచ్చు. సనాతన ధర్మాని కి వేదము ప్రమాణము,ఆ వేదము అపౌరిషీయము , దానిని ఎవ్వరు రచించినది కాదు. అది ఈశ్వరుని ఊపిరి.
 నేను ముందరా నా ఊపిరి ముందరా అని అడిగారనుకోండి అది చెప్పడం కష్టం. నేను నా ఊపిరి ఒక్క సారే ప్రభవిస్తాం. నేను లేను అన్న మాట ఎప్పుడు వస్తుందంటే నా ఊపిరి ఆగిపోయినప్పుడు  . ఆచరించడం అంటే నువ్వు ఈవిధంగా చెయ్యి అని అర్థం. ఎందుకు ఆ విధంగా చెయ్యడం. చాదస్తం కోసమా ? కాదు. మనసుకు ఏదో ఒక ఆలంభన లేకపోతే అది పిచేక్కిన కోతి లాగా ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది.  మనసుని పవిత్రీకరించడం కోసమే ఆచారం అన్నది వచ్చింది. అందుకు తీస్కోచింది వేదం.
మొట్ట మొదట ఆచరాన్ని పాటించడం అన్నది ప్రారంభం అయితే ఆ ఆచరమును అనుస్టిo చిన కారణం చేత మనసు పరిపక్వం అయి , పవిత్రమైన మనసు సత్ కర్మ ఆచరణం నందు ఊంచు కొని నిల బడుతుంది. అటువంటి పవిత్ర కర్మా చరణ  భక్తీ తో చెయ్యడం వలన ఈశ్వరుని యొక్క ప్రీతీ కలుగుతుంది. ఈశ్వరుని ప్రీతి ని సంతరించిన భక్తి తో కూడిన కర్మచారణము జ్ఞానముకు యోగ్యమవుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు హేతువు అవుతుంది.
 అందు కొరకు కర్మ చెయ్య వలసిన దాని  ఆచార ఖండగా  చెప్పడం దగ్గర నించి ఈశ్వరుడే సనాతన ధర్మం లో మనకి వేదాన్ని అందించాడు . ఆ వేదం లో చాలా భాగం ధర్మం గురించే మాట్లాడతారు. ఆచరించినది ఏదైతే ఉందొ దాని పేరే ధర్మం. తెలిసి ఉన్నది ధర్మం కాదు. ధర్మా చరణము నందు తెలిసి ఉండటం అన్నది ఒక సోపానము. ఆచరించడానికి పనికి రాకుండా తెలుసుకోవ డానికి ఏదైతే ఉందొ అది ధర్మం కాదు. తెలుసుకొని ఆచారించినది ఏదైతే ఉన్నదో అది మాత్రమే ధర్మం.
వేదము దేన్నీ చెప్పిందో దాన్ని మాత్రమే అనుస్టించు. ధర్మము నువ్వు పండేటట్లు చెయ్య గలదు . పిందే తనంత తాను గా పండదు. పిందే పండవుతుంది. పిందే ఎప్పుడు పండవుతుంది. పిందే చెట్టు నుండి విడివడకుండా ఉన్నపుడు పండుతుంది . పండై తనంత తాను చెట్టు నించి విడివడుతుంది. పిందే ఆ పువ్వు పుట్టిన ఆ ప్రదేశాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. లోకంలో ఏ పిందే అయిన వగరుగానే ఉంటుంది. పిందే పెరిగి కాయ అవుతుంది , ఏ  కాయ ముట్టుకున్న గట్టిగానే ఉంటుంది. ఏ కాయైన పండిన తరువాత రంగు మారిపోతుంది. లోపల పదార్ధం మెత్త బడిపోతుంది. పందినాక తనత తాను చెట్టు నుంచి విదివడుతుంది. అందుకే పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు "పండి పోయడండి ఆయన " అని .చిన్నపిల్లలు  ఒక ఆట ఆడుతూ ఉండేవారు, ప రమ పద సోపానము అని అనేవారు. అందులో దేవతల మధ్య చేరినప్పుడు కూడా పండరు. పరమ పురుషుని చేరిన తరువాత పండి పోయాడు అంటారు. అంత వరకు పందేoవేస్తూ నే ఉంటాడు. కర్మా చరణము చెస్తూనే ఉంటాడు. పండి పోవటా ని కి కావలశిన ప్రాతి పదికను అందించ డమే ధర్మం.
సనా తన ధర్మం నందున్నంత భోధ మీకు ఇంకెక్కడా కనపడదు. ఏదైనా క్రతువుకాని,ప్రవచనం చివరిలో చెప్పేది
"ఓం శాంతి శాంతి శాంతి: ". ధర్మము దేనికొరకు వచ్చిదంటే ఈ శాంతి కొరకే వచ్చింది. నువ్వు శాoతం గా ఉండాలి ఇంకోకరిని శాంతం గా ఉండనివ్వాలి.
 పరమేశ్వరుడే పిండాoడాన్ని , బ్రంహాడాన్ని శ్రుజియించాడు. ఆయనే కన్నులు ఇచ్చాడు, బయట జలపాతాన్ని ఇచ్చాడు.ఆయనే ఇక్కడ పళ్ళు పెట్టి నాలుక పెట్టాడు, బయట ఆపిల్ పండు పెట్టాడు. పరమేశ్వరుడు ఇక్కడ కంటం పెట్టాడు, బయట నీళ్ళు పెట్టాడు. పర మేస్వరుడు  తిన్న దాన్ని జీర్ణం చేసి మిగిలిన టు వంటి పిప్పిని విడిచిపెట్టే ట టువంటి స్థితి ని ఈ పిండాo డానికి ఇచ్చాడు. ఈ విడిచి పెట్టిందాన్ని పుచ్చుకొమ్మని బ్రహ్మాoడాన్ని  శాసించాడు. బ్రహ్మాడం లో ఉన్న భోగాలను అనుభవించ వద్దని శాసనం చెయ్యలేదు, అనుభవిoచమనే   ఆయన చెప్పాడు, కానీ నీకున్న బలం ఎంతో దాన్ని బట్టి నువ్వు అనుభవించడం కాదు,ఈశ్వరుడు చేసిన నియ మానికి నీవు బద్దుడ వై  అనుభ వించ వలసి ఉంటుంది తప్ప నాకింత శక్తి ఉంది కదా అని శక్తి హీనులైన వారిది అనుభవించ మని మనకి శాస్త్రాలు చెప్పట్లేదు. అక్కడ వచ్చింది ధర్మం అన్న మాట . ఆ ధర్మం అన్నది లేకపోతే బలవంతుడైన వాడు బలహీడైన వాడిని కొట్టుకు తింటాడు.
అందుకే ఈ ధర్మము అన్న మాట సనాతన ధర్మం లో ఎంత వరకి వెళ్లిందంటే, యుద్ధ భూమి అని ఒక భూమి, ఇంట్లో అగ్ని శాల అని ఒక గది అక్కడకి తీస్కెళ్ళి అగ్ని హోత్రాలవి  పెట్టుకుంటారు, పూజ గది ఒక గది, పడక గది ఒక గది, మీ ఇంట్లో మీరు విభాగం చేసుకున్నట్టే యుద్ధం చెయ్య వలసి వస్తే  యుద్ధ భూమి అని వేరొక భూమిని  నిర్ణయం చేసారు,అక్కడికెళ్ళి యుద్ధం చేసేవారు. సామాన్య జనులు పిల్లతో పాపలతో ఉండేటటువంటి నగరాలకి దూరంగా ఉన్న చోట ప్రత్యేకం గా యుద్ధం చెయ్యటానికి వెళ్లి నిలబడేవారు.  యుద్ధం చెయ్యటానికి కూడా ధనుర్వేదం నేర్పేవారు.  యుద్ధం చేసేటప్పుడు కూడా సుర్యోదయత్పూర్వము కాని సుర్యాస్తామయానతరము కాని యుద్దము లేదు.  మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే వ్యాస భారతం లో ఒక అద్భుతమైన ఘట్టం, యుద్ధం పూర్తయి సూర్యాస్తమయం అయ్యింది ఇంకా కాసేపాగితే ప్రాయశ్చిత్తం తో సంధ్యా వందనం చెయ్యాలి, భీష్మా చార్యుల వంటి మహా పురుషులు సూర్యా స్తమయం అయ్యి రధం ఇలా కిందకి దిగగానే ఇంటికి వెళ్లి స్నానం చేసి అర్గ్య ప్రదానం చేస్తే ప్రాయశ్చిత్తం తో చెయ్యవలసి వస్తుంది కనుక స్నానం చెయ్యక పోయిన , పంచభూత స్నానం మనకి ఉంది, శాస్త్రం అంగీకరించింది, కాసింత పృధివి ని తీస్కుని తలమీద వేసుకుని వారు అక్కడే ఉన్నటువంటి మట్టిని తీసి సూర్య భగవానుడికి అర్గ్యం గా విడిచిపెట్టేసారు, అంటే నీ విహిత కర్మాచరణం నువ్వు చెయ్యవలసి వస్తే ఆ సమయం లో నువ్వు స్నానం చేసి లేవన్న బెంగ కూడా  లేకుండా నీకు శాస్త్రం చేసింది.
 ఒక యుద్ద భూమి కి వెళ్తే, అక్కడ నగారా మొగించేవాడు ఉంటాడు, అందరికి నీళ్ళందించే వాడు ఉంటాడు, వంట చేసే వాడుంటాడు. వాళ్ళ జోలికి వెళ్లి వాళ్ళని చంప కూడదు, పారిపోయే వాడిని చంపకూడదు, ధనుస్సు విరిగి ఇంకో ధనుస్సు పట్టుకుంటున్న వాడిని చంప కూడదు, విల్లిచ్చిన వాడిని చంపకూడదు, చుట్టూ చేరి నలుగురు కలిసి ఒక్కణ్ణి చంపకూడదు, యుద్దం చెయ్యకుండా పరాకు గా ఉన్న వాడి మీద బాణం వెయ్యకూడదు, యుద్దానికి తాను సిద్ధ పడి ఎదురొడ్డిన వాడిని మాత్రమే చంపాలి.
ఎక్కడ ఉన్నాయ్ ఈ ధర్మాలు చెప్పండి, తర్వాతి కాలం లో జరిగిన యుద్దాలలో  ఏ పాపం ఎరుగని వాళ్ళు , రాత్రిళ్ళు నిద్రపోతున్న సమయం లో నగరాలకి నగరాల మీద బాంబులు వేసిన ఘన చరిత్ర మిగిలిన చోట్ల ఉంటె, యుద్ద భూమి యoదు పాటించ వలసిన ధర్మాలను చెప్పి, అలాగే సంధ్యా వందనం చేసి అలాగే యుద్ధం చేసినటువంటి జాతికి వారసులo  మనం. అంతగొప్ప ధర్మం ఈ జాతిది. ప్రతి చోట ధర్మమే, ధర్మం విడిచి బ్రతకటం కన్నా, ధర్మాచరణం లో ప్రాణము విడవటమే శ్రేయస్కరం అని నమ్మి బ్రతికారు. అంత గొప్పగా ధర్మ ప్రభోదం చేసారు. ఆ ధర్మమే పోయిన నాడు నీవు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. కాబట్టి ఆ ధర్మాన్ని ఒకటికి పదిమార్లు లోకానికి భోద చెయ్యాలి. ప్రతివారికి ధర్మాన్ని అందించాలి. ఈ అందించడం లో వచ్చినటువంటి మహోత్కృష్ట మైన తువంటి ఇతిహాసమే మహాభారతం.
 భారతం భారత వంశమునకు సంబందించిన కధా అని ప్రతీతి, కాదు కాదు మీరు జాగ్రత్తగా గమనిస్తే "భా " అంటే కాంతి అన్న అర్థాన్ని మీరు వేరొకరకం గా చుస్తే జ్ఞానమే కాంతి. జ్ఞానం మన్న కాంతి యందు యదార్ధ మైన వస్తువు కనపడుతుంది, ఆ కాంతి లేకపోతే చీకట్లో దుంగ కి దొంగ కి తేడా తెలియనట్లు, త్రాటికి పాముకి తేడ తెలియనట్లు,
జ్ఞానమే కాంతి కలగ నంత వరకు సత్య వస్తువుకి అసత్య వస్తువు కి భేదం గోచరించాదు .
 కాబట్టి అటువంటి సత్య వస్తువు ఎరుకలోకి రావాలి అంటే జ్ఞానం అనేటటువంటిది  కలగాలి.  ఆ జ్ఞానం అనే కాంతి కలగాలి అంటే, నా వంట్లో బలం ఉంది కదా  అని నేను భోగం అనుభవించ కూడదు, నేను ఏదైనా అన్నా వాడు తిరగాబడ లేడు  కదా అని వాడిని హింసించ కూడదు. నేను ఈస్వరుడుకి జవాబుదారిగా బ్రతకవలసిన నియమా వళిని, ఆ చట్రాన్ని తెచ్చి మనకి అందించారు, అదే ధర్మ చక్రం, ఆ చక్రం ఎప్పుడూ తిరుగుతునే ఉంటుంది. అంటే కదిలే ధర్మము ను పట్టుకొని కదలని సత్యము లోనికి వెళ్ళిపోతాడు. చిట్ట చివర ఆ సత్యము ఎరుకలోకి వచ్చిన తరువాత, తన కన్నా వేరొక వస్తువు లేదు సమస్తము ఇదే "అద్వైతం ". రెండవ వస్తువు లేదు ఉన్నదావుక్కటే అన్న ఎరుక కలిగిన తర్వాత,ఆ ఎరుక యందె నిలబడి తన శరీరాన్ని విడిచి పెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు మళ్ళి పుట్ట వలసిన స్థితికి వెళ్ళ గలుగుతాడు అని ధర్మ ప్రభోదాన్ని చేసాయి, కావ్యాలు పురాణములు.
  "భా " ఆ జ్ఞానము నందు "రత" రామిచాలని కోరిక కలిగి ఉన్నారో.  మేము ధర్మాన్ని పట్టుకుంటాం అని కోరుకున్న వారెవరున్నారో అటువంటి వాళ్ళ అందరి కోసం ఆ నాడు మహానుభావుడు అయినటువంటి వ్యాసుడు మనకి భారతాన్ని అందించాడు. ఆ భారతమే తదనంతర కాలం లో వ్యాస భగవానుని యొక్క ప్రతి రూపం గా  ఎందరో మహానుభావులు ఆ నాటి నుండి ఈనాటి వరకు మహాభారత ఇతిహసాన్ని లోకాని కి ప్రవచన రూపం లో అంద చేస్తూ నే ఉన్నారు. అందుకే మహా భారత ప్రవచనం ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రీతి పొందేవాడు ఈశ్వరుడు కాదు ట, వ్యాస భగవానుడు ప్రీతి చెందుతాడు ట. నేను నా జాతి ధర్మం పట్టుకుoటుoదని, నా వారసులు జ్ఞానం కోసం అలమటిస్తా రాని, నేను అందించే ఈ ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటారని, ఇంత గొప్ప గ్రంధాన్ని రచించి అందించాను, వీళ్ళు ఇంత సంతోషం తో భారతాన్ని చెప్పుకుంటున్నారు, వింటున్నారని, ఎక్కడెక్కడ భారతం మీద ప్రవచనం మొదలవుతుందో అక్కడక్కడ వ్యాస భగవానుడు ఏదో ఒక రూపం లో వచ్చి కూర్చుంటూ నే ఉంటాడు. అంత టి మహానుభావుడు సంతోషిస్తే మన జీవితానికి వేరే సాఫల్యం ఏముంటుంది చెప్పండి. అంత గొప్ప గ్రంధం మహాభారతం.
ఆ మహా  గ్రంధం చాలా కాలం సంస్కృతం లో ఉండిపోయింది. ప్రత్యేకించి ఆంధ్ర భాషా లోకి రాలేదు. ఈశ్వరుడి యొక్క సంకల్పం పరదేవతా సంకల్పం, ఆ తల్లి దానికి కావాల్సిన పనిముట్టు కూడా ఆవిడే తెచ్చుకుంటుంది, అటు వంటి పనిముట్టు తెచ్చుకోవాలి అంటే, మంత్ర భాగము నందు శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి.
ఎవరు శ్రద్ధా భక్తులతో మళ్ళి మళ్ళి జపం చేస్తారో వారిని రక్షించ గల శబ్ద విస్పొటన శక్తి సమహరమునకు మంత్రము అని పేరు. విస్పోతనము చేయ్యగాలిగినటువంటి భీజాక్షరములను తీస్కొచి సమాహారము గా కూర్చి దానికి అధిష్టాన మైనటువంటి ఋషిని దేవతని నిర్ణయము చేసి వేదములో ఈశ్వరుడు దాన్ని  మనకు అందిస్తే అటువంటి మంత్రము  మీద   నమ్మకం తో విశ్వాసం తో ఎవడు నిలబడి ఆ మంత్రాన్ని అనుస్టిస్తాడో, అటువంటి వాడు ఆ మంత్రం యొక్క శక్తి పొంది తానూ భూలోకం లో నడయాడుతున్న ఆ మంత్ర శక్తియే ఆ రూపంలో తిరుగుతున్నట్టి వ్యక్తి గా మారి ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తి జన్మించాలి అంటే అది కాకతాళీయం  గా  జరిగేటటువంటి విశేషం కాదు, దానికి పరమేశ్వరుని యొక్క కృప ఉండాలి, పరదేవతానుగ్రహం ఉండాలి, ఉంటే  తప్ప సంస్కృతం లో ఉన్నటువంటి మహాభారతాన్నిఆంధ్రీ కరించ గలిగి న మహా పురుషుని జననం జరగదు, ఒక వేళ జరిగినా  అంత గొప్ప భారతాంధ్రీకరణ ప్రయత్నానికి సంకల్పం తాను చేసి, అటువంటి మహా పురుషుడు ఒకడు ఉన్నాడని గుర్తించి, ఆయనది త్యాగము తో కూడిన జీవితం అని గుర్తించి, ఆయనకి ప్రతిఫలా పేక్ష లేదు, ఈయన కారణ జన్ముడు, ఈయన జన్మించినందుకు ఈయన దగ్గర భారతాన్ని ఆంధ్రీకరింప చేస్కొని దీన్ని నేను రాజునైనందుకు నా కాలం లో ఈ భరతం ఆంధ్రీకరింప బడింది అని నేను అనుపించుకుంటే , దాని వలన ఈ జాతికి నేను రాచరికం చేసినందుకు శాస్వతుడ నౌతను తప్ప . ఎంతమంది రాజులు వెళ్ళిపోయారు , అందరు గుర్తున్నారా, ఎవరో ఎక్కడో ఒక మహానుభా వుడు ఉంటాడు. అన్ని రాళ్ల మధ్యలో ఉన్నటువంటి సాలగ్రామాన్ని గుర్తించి, అన్ని రాళ్ళని పడతోసి సాలగ్రామాన్ని తీస్కొచి నీట కడిగి అభిషేకం చేసి మెత్తటి దూది తో తుడిచి గంధం రాసి బొట్టుపెట్టి పూజా మందిరం లో పెట్టి పూజించి, సాలగ్రామము యొక్క ఆరాధన చేత సాలగ్రామము నందు ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆరాధకుని లా ఇన్ని రాళ్ల మధ్యలో సాలగ్రామము ఉన్నట్టు , తన రాజ్యం లోనే ఇంత మంది గృహస్తుల మద్యలో ఒక గృహస్తు గా  ఇంతమంది వేదం చదువుకున్న వాళ్ళలో తానూ ఒక వేదం చదువుకున్న వాడిలా , ఇంత మంది మంత్ర జపం చేస్కునే వాళ్ళలో తానూ ఒక మంత్ర జపం చేస్కునే వాడిలా , ఇంత మంది ఉభయ భాషా ప్రవీణు లలో తానూ ఒక ఉభయ భాషా ప్రవీణు డిలా కనపడుతూ తాను ప్రత్యేకం గా మహాభారతాన్ని ఆంధ్రీకరించ గలిగిన ప్రజ్ఞ తో కుడి ఉన్న వాడను అన్న మాట కూడా అతిశయం తో ఎక్కడా చెప్పనటువంటి వ్యక్తి  ని గుర్తించగలిగిన ప్రజ్ఞ ఒక రాజు యందు ప్రచోదనం కావాలంటే అది కూడా పరదేవతను గ్రహమే. 
పరదేవత ఒక రాజు యందు ఆవహించి అటువంటి కోర్కె పుట్టించాలి.  ఎందుకు ఆంధ్రీకరిస్తారు, ఆంధ్రీకరించి అందించడానికి ఎంత కష్ట పడితే, ఎంత తాపత్రయ పడితే, వాళ్ళు ఎంత వ్యగ్రత ని పొందితే వాళ్ళ శరీరము ఎంత ఖేదాన్ని పొందితే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించి ఉంటారు, తిక్కన సోమయాజి భారతాన్ని అందించి ఉంటారు ఎర్రాప్రగడ భారతాన్ని అందించి ఉంటారు, వారికి ఎందుకు అందించాలన్న కోర్కె పుడుతుంది. నీకు శక్తి ఉంది రాయవో భారతాన్ని అంటే రాస్తారా ? భారతాన్ని ఎందుకు ఆంధ్రీకరింప బడాలని కోరుకుంటున్నాడో ఆయన నోటి తో ఆయన చెప్పినప్పుడు, ఆయన తోడి తనకున్న తువంటి స్నేహవిశేషం చేత ఆయన శీలాన్ని విచారణ చేసినటువంటి సమర్ధుడైన ఆంధ్రీకరించ గలిగినటువంటి కవి రూపం లో భూమి మీద తిరుగుతున్నటువంటి  ఈశ్వరు ని యొక్క ప్రజ్ఞా విశేషము కలిగినటువంటి ఆ కారణ జన్ముడు, రాజు చెప్పిన మాట యదార్థము అని గుర్తించి ప్రచోదనాన్ని పొందితే ఆ సంతోషం తో ఆ ఆనందం తో ఇవాళ్ళ నేను అందించే ట టు వంటి ఈ భారతం రాబోవు కాలం లో ఎన్ని కోట్ల మందిని తరింప చేస్తుందో, ఎంత మందికి ధర్మాన్ని అందిస్తుందో, కాబట్టి నేను ఆంధ్రీకరించ వలసిందే అని తన్కున్నటువంటి పాండితీ ప్రకర్ష ని తనకున్న ప్రజ్ఞా విశేషాలని రంగరించి ఘంటం పట్టుకొని ఆంధ్రీకరించి వాళ్ళు ఏమీ కోరకుండా ఆ భారతాన్ని లోకానికి అందించి తమ శరీరాలని విడిచి పెట్టి వెళ్లి పో యినటువంటి నన్నయాదులు ఎవరైతే ఉన్నారో వారు మనకి ప్రతస్మరణీయులు, వారు వందనీయులు, వారికి  నమస్కరించక పోతే మనకు ఋషి ఋణం తీరదు. పుట్టుకతో ఋషి ఋణం ఉంది మనకి.
అంతటి మహా పురుషులైన వారు కేవలం గా ఇవాళ్ళ నన్నయ్య గారు ఆదిపర్వం, సభాపర్వం కొంత భాగం చేసి శరీరాన్ని విదిచిపెట్టేస్తే వెంటనే తిక్కనగారు ఆయన శరీరం విడిచి పెట్టిన ఉత్తర క్షణం లో మిగిలిన భాగాన్ని నేను పూర్తి చేసేస్తానండి అని అన్న వాళ్ళు లేరు , మళ్ళి అటువంటి సమర్థు డు పుట్టాలి అంటే మళ్ళి కొన్ని వందల సంవత్సరాల వ్యత్యాసం వచ్చేసింది.
మళ్ళి తిక్కన గారు పుట్టినప్పుడు ఆయనలోని ప్రతిభని కనిపెట్ట గలిగే రాజు పుట్టాలి అంటే మళ్ళి పరదేవతను గ్రహం కొన్ని వందల సంవత్సరాలకి. కాబట్టి నన్నయ్య కాలం లో పుట్టిన వారు మనంత అదృష్ట వంతులు కారు, ఎందుకో తెలుసా వాళ్ళు  తెలుగు చేయ బడిన భారతాన్ని పూర్తి గా చదువుకోలేదు, నన్నయ్య గారు చేసిన భారతం మాత్రమే చదివారు. తిక్కన గారి కాలం లో వాళ్ళు మనంత అదృష్ట వంతులు కారు, వాళ్ళు నన్నయ్య గారు తిక్కన గారు ఆంధ్రీకరించిన భారతాన్ని చదువుకున్నారు. ఎర్రాప్రగడ కాలం లో వాళ్ళు ఎర్రాప్రగడ ఆంధ్రీకరించింది చదివారని నమ్మకం లేదు. 
మనం చాలా అదృష్టవంతులం, ఎందుకంటే నన్నయగారు తిక్కన గారు ఎర్రాప్రగడ గారు రాసి మనకు అందిస్తే, మనం వెళ్లి తాళ పత్రాలు తెచ్చుకొని రాస్కుని ప్రతిని తెచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా వెళ్లి ద్రవ్యం ఇస్తే ఆ ద్రవ్యనికి గ్రంధం వస్తే ఆ గ్రంధాన్ని పట్టుకుని హాయిగా చాడువుకోవచ్చని ఈశ్వరుడు అనుగ్ర హిస్తున్నాడు. అయిన అనుభవించని వాడు ఇంటి కింద ఐశ్వర్యం ఉంది అని తెలిసి కూడా అనుభవించకుండా పక్క ఇళ్ళకి వెళ్లి భిక్షమెత్తుకొని అక్కడేదో ఐశ్వర్య ము ఉందనుకొని వెళ్ళిన దరిద్రుడు ఎటువంటి వాడో, తన ఇంట నున్న భారతాన్ని చదువుకొని తరించాలేనివాడు, అటువంటి వాడు. కాబట్టి మనం భాగ్య వంతులం.  అటువంటి మహా భారతం.
అటువంటి పంచమ వేదం.
ఆ మహాభారతాన్ని ఆంధ్రీకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దలు ఒక మాట అంటారు. నన్నయ్య గారికి "ఆదికవి" అని ఒక బిరుదు. ఆయనకి ఉన్న  బిరుదునా మా లలో ఒకటి. అయితే నిజానికి బిరుదు నామం కాదు గొప్పది, నన్నయ్య గారు మన జాతి కి అందించిన గొప్ప ఫలం ఉన్నదే అదే మనకు గొప్పది. 

3 comments:

  1. అమ్మా లావణ్యా,
    ఏదో, ఎక్కడో వెతుకుతూ వుంటే నీ బ్లాగ్ ఆంధ్ర మహా భారతం కనిపించింది. శుక్లం *భ*ర ధరం తో మొదలు కావడం నవ్వు వచ్చినా, మొత్తం పాఠం చదివిన తర్వాత చాల సంతోషమైంది. యింజనీర్లకు యింత తెలివా? అనిపించిన మాట వాస్తవం. World famous ఐపోవడం సాధ్యమే! అ రవి రిసిన లావణ్య ము.... బాగుంది. నా చిన్న చెల్లెలి పేరూ లావణ్యనే. ఆమె భర్త పేరూ రవికుమార్. రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిన ఒకానొక యింజనీర్.
    All the very best to you ma!
    .. Prasad

    ReplyDelete
  2. చాలా బాగా రాసారు

    ReplyDelete
  3. Naku maha baratham lo sokalu adhi adharalu kavali

    ReplyDelete