Monday, May 26, 2014

ఆదిపర్వము 8

అగ్నిహోత్రాన్ని ఆరాధించే అలవాటు ఉంది కాబట్టి, ఆర్య శబ్దం తో పిలిచారు ఈ జాతిని. ఇంటి యజమాని బ్రతికున్నంత కాలం వెలుగుతూనే ఉంటుంది. ఇంటి యజమాని శరీరం విచిపెట్టినప్పుడు ఈ అగ్ని హోత్రాన్ని తీసుకుని వెళ్లి కట్టేల్లో పెట్టి ఆయన శరీరం కాల్చేస్తారు. లేదా ఆయన సన్యసిస్తే ఆ అగ్ని ఆగిపోతుంది. ఎందుకంటే సన్యాసికి అగ్నితో సంబంధం ఉండదు. సూర్య భగవానుడి అనుగ్రహం కలిగితే ఆరోగ్యం నిలబడుతుంది. అలాగే అగ్నిహోత్రుని అనుగ్రహం కలిగితే ఐశ్వర్యం  కలుగుతుంది.
ఇప్పుడు బృగువు స్నానం కి వెళ్తున్నాడు , ఆయన వెళుతూ భార్యకి పరాకు చెప్పాడు భార్యకి, అగ్నిశాల లో అగ్నిహోత్రుడు ఉన్నాడు జాగ్రత్త. అగ్ని హోత్రుడు  సర్వదేవతా స్వరూపుడు.  కేరళ రాష్ట్రము లో విగ్రాహాలకి వాటిల్కి పూజ చెయ్యరు. ఒక పెద్ద దీపం వెలిగిస్తారు , అదే అమ్మవారు అని పూజ చేస్తారు. 
అసలు దీపం లేకుండా పూజ చెయ్యం మనం. అందుకే ఎంగిలి గాలితో అగ్ని ని నిధనం చెయ్యకూడదు. అటువంటి అగ్నిని జాగ్రత్త గా చూడామని చెప్పి  సాయంత్రం పూట స్నానాని కి వెళ్తున్నాను, అగ్ని ని కాపాడు అని భార్య పులోమ కి చెప్పి వెళ్ళాడు. ఆవిడ అగ్నిని రక్షిస్తుంది. అగ్ని ని రక్షించడం అంటే ఏమి చేస్తారు అంటే కాస్త ఊక వెయ్యాలి , కాసిని అక్షింతలు వెయ్యాలి. అలా ఆవిడ అగ్ని ని సంరక్షిస్తుంది. అగ్ని వెలుగుతున్నాడు అంటే 
 ఈస్వరుడే ఉన్నాడు అని అర్ధం. 
ఇప్పుడు పులోమ రాక్షసుడు అని ఒకాయన ఉన్నాడు, ఆయన కి ఎప్పటినించో ఈవిడ (పులోమ) మీద కన్ను. వాడికి ఆమె యందు ప్రీతీ ఉండటమే ఒకతప్పు , ఎందుకంటే తనకి ప్రీతీ ఎవరి మీద ఉండాలి, తన తండ్రి ఎవరినైతే తీస్కొచి తన పక్కన కూర్చోపెట్టాడో ఆమె యందు ప్రీతి ఉండాలి తప్ప వేరోకరియందు ఉండకూడదు. పెళ్లైపోయిన తరువాత కూడా ఆవిడ మీద మనసు పెట్టుకోవటం ఇంకో తప్పు. ఇప్పుడు పులోమ మీద పులోమ రాక్షసుడికి మనసుండి పోయింది. బృగువు స్నానా నికి వెళ్ళిన వెంటనే వచ్చాడు పులోమరాక్షసుడు, వచ్చిన వాడికి అనుమానం వచ్చింది, ఈవిడేనా పులోమ అని అనుమానం వచ్చింది. ఈవిడేనో కాదో తెలుసుకుని వ్యామోహ ప్రకటన చేద్దాం అని ఇప్పుడు ఎవరిని అడగాలి , అక్కడ అగ్నిహోత్రుడు ఉన్నాడు ,ఆవిడ ఉంది . ఇప్పుడు అగ్నిహోత్రుడు ఈశ్వరుడు అన్న భావన వాడికి ఉంటె ఆయన్ని అడుగుతాడు. కాబట్టి వాడికి అగ్ని ఈశ్వరుడు అన్న భావన ఉంది అగ్నిహోత్రున్ని అడిగాడు ఈవిడ పులోమ నేనా అని అడిగాడు. ఇప్పుడు అగ్ని హోత్రుడు సంకటం లో పడ్డాడు. ఆయన లోకం లో చేసి పాడవుతున్న వాళ్ళని , చెయ్యక పాడవుతున్న వాళ్ళని ఇద్దరినీ చూస్తున్నాడు , కాబట్టి ఆయనకీ సత్యము అసత్యము గురించి బాగా అవగాహన ఉంది , ఆయన అనుకున్నాడు ఈమె పులోమ అంటే వీడు రాక్షసుడు ఎత్తుకు పోతే బృగువు వచ్చి నన్ను శపిస్తాడు ఎందుకు చెప్పావ్ మా ఆవిడే పులోమ అని , చెప్పకపోతే నాకు తెలీదు అనో , ఈవిడ పులోమ కాదుఅనొ చెప్తే అసత్య దోషం వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమి చేసాడంటే ఏది తక్కువ దోషమో లెక్కలు మొదలుపెట్టాడు.  అసత్యం ఆడటమా లేకపోతే ఈవిడే పులోమ అని చెప్పేస్తే వాడు ఏదో ఒక అపకారం చేస్తే ఈవిడ రక్షింపబడు తుంది , ఎందుకంటే నన్ను ఆరాధన చేస్తుంది , కాని ఏదో ఒక రకం గా బాధ కలుగుతుంది రాక్షసుని వలన అప్పుడు బ్రుగువుకి కోపం వస్తుంది , ఎవరు చెప్పారు అసలివిడ పులోమని అంటాడు అప్పుడు నన్ను శపిస్తాడు. శాపం పుచ్చుకోనా అబద్దం ఆడనా అని ఆలో చించాడు . అబద్దం ఆడటమే పెద్ద దోషం , శాపం ఇస్తే మళ్ళి ఆయన కాళ్ళ మీద పది శరణు వేడుకోవచ్చు. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు సత్యాసత్య గురించి ఎంత విచారణ  ఉండేదో చుడండి. 
ఇప్పుడు ఈవిడే పులోమ అని అనగానే ,ఆ రాక్షసుడు అన్నాడు అసలు ఈవిడకి పెళ్లి అవ్వక ముందు ఎప్పుడో ఈవిడని నేను చేస్కుందాం అనుకున్నాను , ఈవిడ పేరు నా పేరు ఒకటే నే చేస్కుందాం అనుకున్నాను కానీ బృగువు చేస్కున్నాడు , అయితేనేమి నేను పట్టుకుపోతాను అని పట్టుకు పోతున్నాడు. ఎత్తుకు పోయేటప్పుడు తేలిక గా ఉంటుందని వాడు పందిరూపం  చేసుకుని ఎత్తుకు పోతున్నాడు . ఆవిడ కన్నీటి ధరతో ఏడుస్తూ , భర్త కోసం అరుస్తూ ఉండగా ఎత్తుకు పోయాడు. అలా  ఎత్తుకు పోతూ ఉండగా ఆవిడ నిండు గర్భిణి ,ఆ పండి ఎత్తుకుపోయే కుదుపులకి ఆవిడ గర్భం లోనించి ఒక పిల్లవాడు  జారి పడిపోయాడు.  ఆ కింద జారి పడిపోయాడు కాబట్టి ఆ పిల్లవాడికి జవనుడు అని పేరు వచ్చింది. ఆ కింద పడి పోయిన పిల్లవాడు పరమ తేజో స్వరూపుడై , ప్రళయ కాలపు అగ్ని హోత్రం ఎలా ఉంటుందో, అలా ఆ పిల్లవాడు చూసాడు , ఎవడురా మా అమ్మ కి అపరాధం చేసిన వాడు అని చూసాడు ,పులోమ రాక్షసుని వంక , అంతే వెంటనే ఆ రాక్షసుడు బూడిదై పోయాడు. ఈవిడా ఆ పిల్లవాడిని చంకన ఏసుకుని మల్లి అంత దూరం నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఈలోగా ఎత్తుకు పోతుంటే ఏడ్చింది కదూ , మహాపతివ్రత యొక్క కంటి నీటి బిందువులు ఒక మహానది గా ప్రవహించాయి. అదేమన్నా సామాన్యమైన విషయమా , ఇప్పుడు ఈ నది ఒక మహా పతివ్రత కంటి  ధరల నించి వచ్చింది కనుక ఇప్పుడు దీనికి పేరెవరు పెట్టాలి అని బ్రహ్మ గారిని అడిగారు ,ఆయన అన్నాడు  దీనికి వధూసరా అని నామకరణం చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు ఆవిడ ఇంటికి వచ్చింది. ఇప్పుడు బృగువు స్నానం చేసి వచ్చాడు ,బృగువు స్నానం చేసి వచ్చే లోపల ఈ  అల్లరంత అయిపోయింది.  ఇప్పుడు ఆవిడ చంకన పిల్లాణ్ణి పెట్టుకుని ఏడుస్తూ ఉంది డస్సి పోయింది ఎర్రగా పిల్లడు ఉన్నాడు. ఈ పిల్లడు ఎవరు అన్నాడు బృగువు.మన పిల్లవాడే చవనుడు అన్నది.  ఎప్పుడు పుట్టాడు  అన్నాడు . ఇప్పుడే పంది  ఎత్తుకు పోతుంటే జారిపడ్డాడు అని చెప్పింది. పంది ఎత్తుకు పోవటం ఏమిటి అన్నాడు . అంటే ఎవరో పులోమ రాక్షసుడు వచ్చాడు , ఈవిడే పులోమా అని అడిగాడు ,నేనే పులోమ అని తెలియగానే పంది  ఎత్తుకు పో యాడు. ఎత్తుకు పోతుంటే ఈ పిల్ల వాడు జారిపడ్డాడు, పడుతూనే కోపంగా చూసాడు వాడు బూడిదైపోయాడు. పిల్లవాడి తేజస్సు అటువంటిది , అగ్నిని ఆరాధించిన ఫలితం.  ఇదిగో  పిల్లవాడు అని   చూపించింది. చాలా సంతోషం అన్నాడు , అసలు నువ్వు పులోమ అని చెప్పిన వాడేవ్వరు అని అడిగాడు. ఈయనే అని చెప్పిందావిడ అగ్నిహోత్రుడు ని చూపించి . 
.
వెంటనే ఆయన అగ్నిహోత్రున్ని చూసి అన్నాడు , రొజూ నేతి అన్నం హవిస్సు ఇస్తుంటే ,రోజు ఊక , అక్షతలు వేస్తుంటే అన్ని తిని నీకు కొవ్వు పట్టి ఇలాంటి మాటలు చెప్పావు. కాబట్టి అన్నీ తినటం నీకు అలవాటు అవ్వు గాకా , అన్ని తింటావు ఇవ్వాళ నించి అని అన్నాడు. ఇప్పుడు ఆయన హడలి పోయాడు , ఏదో ఒక శాపం ఇస్తాడు అనుకున్నాను , ఇప్పడు అన్ని తినమని అంటున్నాడు ,ఇప్పుడు తినకుడ ని వి ఏవి లేవు అన్నాడు. అన్ని తినడం అంటే తేలికైన విషయం కదండీ , మనం వంకాయ కుర ఒకరోజు చేసి మరుసటిరోజు అదే కుర చేస్తే నే మనం తినలేనప్పుడు .  సద బ్రాహ్మణుడు అయిన అగ్నిహోత్రుడు అన్ని తినేయడం అంటే బాధ కదండీ అటువంటి అగ్ని హోత్రుడు బ్రుగువుని చూసి అన్నాడు నేనూ ఇవ్వగలను శాపం ఎందుకు ఇవ్వగలను అంటే
సత్యము చెప్పుట అంటే కేవలము నిజాము చెప్పుట అని కాదు అర్థం, సత్యం చెప్పుట అన్న మాట కి అర్థం ఏమిటంటే మనుష్య సహజమైన ప్రేమ  చేత అమాయకం గ ఉన్నటువంటి ఒక ప్రాణి యొక్క గౌరవన్ని కానీ ప్రాణికి కలగబోయే ఇబ్బందిని కానీ దృష్టిలో పెట్టుకుని రక్షించుట కొరకు ఆ  సమయం లో  నిజానికి బదులు  అబద్దం చెప్పినా శాస్త్రం దాన్ని నిజం గానే తీస్కుంటుంది.
అగ్నిహోత్రుడు బృగువు యొక్క పత్ని మహా పతివ్రత ,నిండు చూలాలు, ఆమెని ఈమె పులోమ కాదు అని అబద్దం చెప్పినా సత్యం కిందనే లెక్కకి వస్తుంది. అగ్ని హోత్రుడు సత్యం చెప్తున్నాను అనుకుని సత్యం యొక్క పరిధిని దాటిపోయాడు . అక్కడ వచ్చింది దోషం అందుకు ఇవ్వవలసి వచ్చింది బృగువు శాపం అగ్నిహోత్రుడికి. ఇప్పుడు బృగువు ఇచ్చిన శాపం వలన దోషం చెయ్యని వాళ్ళు వచ్చి పడిపోయారు. ఎలా పడిపోయారో తెలుసా , ఇప్పుడు ఆయన ని అన్ని తిను అన్నాడు , ఇప్పుడు ఆయన ఆశుద్ది అయిపోయాడు, అందులో తీస్కెళ్ళి అశుద్ధం పారేసినా కలవల్సిందే. అలా అగ్నిహోత్రుడు అన్నీ తినేస్తుంటే ఆయన అసుచి అయిపోతాడు .  మొన్న ఉదంకోపాఖ్యానం లో చూసాం కదా అమృతం తిన్నా ఆచమనం చెయ్యవలసి వచ్చింది.
ఎక్కడెక్కడ  ఎవరెవరు ఏమి కలుస్తున్నారో తెలీదు, మీరు ఇక్కడ చేసే యజ్ఞం నిష్పలం అయిపోతుంది. మీరు అగ్ని ముఖతా ఇచ్చింది పుచ్చుకోవటానికి ఆయనకీ అర్హత లేదు , ఎందుకంటే ఆయన అసుచిగా ఉన్నాడు .  ఇప్పుడు దేవతలకి అన్నం దొరకదు. పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ.  వర్షం కురిపించడం దేవతల చేతిలో ఉంటుంది. దేవతల ఆకలి తీర్చడం నీ చేతిలో ఉంటుంది.  వాళ్ళు వర్షం కురిపిస్తారు, నీకు పంటలు పండుతాయి. నువ్వు పంటని ఇంటికి తెచ్చి యజ్ఞం చెయ్యాలి . ఆ హవిస్సుని వాళ్ళు పుచ్చుకుంటారు.  వాళ్ళు భోజనం చేస్తారు . వాళ్ళు తృప్తి చెందుతారు. వర్షం కురిపిస్తారు. మళ్ళి పంటలు పండుతాయి.  మళ్ళి యజ్ఞం చేసి కొంత పదార్థాన్ని హవిస్సుగా ఇవ్వు. దేవతలు త్రుప్తిచెండుతారు. ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉండాలి. ఈశ్వరుడు ఇలా నియమం చేసాడు.
ఇప్పుడు అగ్ని దేవుడు అసుచి అయ్యాడు కాబట్టి , దేవతలకి కడుపునిండదు.  కవ్యం వెళ్ళదు కాబట్టి పిత్రుదేవతలకి పిండ ప్రధానం లేదు. ఇప్పుడు దేవతలకి అన్నం లేదు కాబట్టి , వర్షాలు కురవావ్ , పంటలు పండవు.  నదుల్లో నీళ్ళు ఉండవు , కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఇబ్బందిలో పడిపోయాయి. నీకు నేను అసత్యం పలికాను అనిపిస్తే నువ్వు వేరే ఏదైనా శాపం నాకు ఇవ్వాల్సింది , ఇప్పుడు నువ్వు ఇచ్చిన శాపం వలన లోకం వ్యవస్థ అంతా ఆగిపోయింది. కోపం వాళ్ళ వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయో చుడండి.

ఇప్పుడు అగ్ని హోత్రుడు అన్నాడు నేనుకూడా నిన్ను శపించ గలను , కానీ అనుస్టాన తత్పరులై , వేద వేదాంగములు చదువుకుని , నిత్యం దేవతలని పరమ ప్రీతితో ప్రార్థించే బ్రాహ్మణుల నోటివెంట వచ్చే మాట ఎంత దూరం వెళ్తుందో తెలిసి వాళ్ళు కొట్టినా పొడిచినా ఓర్పు వహించి మాట్లాడటలేదు తప్ప తిరిగి శపించలేని వాడను కాను. ఇంక తను చెయ్య గలిగింది లేక , లోకంలోని సర్వ ప్రనులలోను తన తేజస్సును ఉపసంహరించుకున్నాడు. అగ్నిహోత్రం ఆగిపాయింది , యజ్ఞాలు ఆగిపోయాయి , నిత్యగ్నిహోత్రాలు ఆగిపోయాయి. దేవతల కి హవిస్సులు ఆగిపోయాయి , పిత్రుదేవతలకి కవ్యాలు ఆగిపోయాయి , పిండాలు ఆగిపోయాయి , వర్షాలు ఆగిపోయాయి. లోకం అంతా సంక్షోభం లో మునిగి పోయింది.  అందరు చతుర్ముఖ బ్రహ్మ గా రి దగ్గర్కి పరిగెత్తారు.  ఏ ఆపద వచ్చినా అందరు ఆయన దగ్గరకి వెళ్తారు. అయ్యా ఇలా బృగువు అగ్నిహోత్రున్ని ఇలా శపించాడు , లోకం స్తంభించిపోయింది ఎలా అని అడిగారు . బ్రహ్మ దేవుడు అగ్నిహోత్రున్ని పిలిపించారు.
ఆయన తో బ్రహ్మగారు అన్నారు ఏమయ్యా నువ్వు ఈ భూత సంతతి అంతటికి భర్తవి , భారించేవాడివి, వేడి ఉన్నంత సేపే ప్రాణాలు ఉంతాయి. లోకం లో పధర్థములన్ని పచనమై రుచి వస్తుంది.  వండుకోక పోతే రుచి ఎక్కడ ఉంటుoది. అటువంటి వాడివి కోపం వచ్చి నీ తేజస్సుని ఉపసంహారం చెయ్యొచ్చా? అంటే అగ్నిహోత్రుడు తనకి కలిగిన ఇబ్బందిని చెప్పాడు. ఇప్పుడు బృగువు మాట వెనక్కి తీయ్యటానికి వీలు లేదు కాబట్టి, నువ్వు సర్వ భాక్షకుడవే , నువ్వూ అన్నీ తింటావు , కానీ అన్నీ తిన్న నీ పవిత్రతకి లోపం రాదు. నువ్వు ఎప్పుడూ పవిత్రుడవే. నీకు వరం ఇస్తున్నాను. ఆచమనం కుడా చెయ్యక్కర్లేదు.  అన్నాడు బ్రహ్మ గారు. ఇప్పుడు అంతా మాములు అయిపోయింది. దేవతలకి హవిస్సులు అన్డుతున్నై , వర్షాలు కురుస్తున్నై, సంతోషం గా కాలం గడుస్తుంది.
ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈకధ అంత అంటే
సర్ప యాగం లో పాముల్ని అగ్నిహోత్రుడు ఎలా తిన్నాడు అని అడిగిన ప్రశ్న కి జవాబు చెప్పటానికి , బృగువు దగ్గర జరిగిన కధ అంతా చెప్పి ఎందుకు అగ్ని  సర్వభక్షకుడు అయ్యాడో అయినా పవిత్రుడు అయ్యాడో మహానుభావుడు సౌతి ఈ విషయాలన్నీ ఆ నైమిశారణ్యం లో ఉన్న ఋషులకి  చెప్తూ , ఇప్పుడు బృగువు కి పులోమకి పుట్టిన చవనుడు, శర్యాతి  అనే రాజు యొక్క కుమార్తె అయిన సుకన్య  ని పెళ్లి చేసుకున్నాడు.  
దేవి భాగవతం లో వస్తుంది, చవనుడు పుట్టలో కూర్చొని తపస్సు చేస్కుంటుంటే, ఆయన కళ్ళు  మిణుగురు పురుగుల్లా కనపడుతున్నై అని ఆవిడ పొడవటం, వ్రుద్దుడైనా కూడా  ఆవిడ వివాహం చేస్కోవటం, పరమ భక్తి తో భర్త ని అనుసరించడం. అశ్వని దేవతలు రావడం, నీకు నీ భర్త మీద అంత పాతివ్రత్యము , అంత మమకారము ఉంటె ఏది మేము చూస్తాము, ముగ్గురం కలసి స్నానం చేస్తాం , ముగ్గురం ఒక్క లా ఉంటాం .  నీ భర్త ఎవరో నువ్వు గుర్తుపట్టు అనడం, ముగ్గురూ వెళ్లి ఆ నదిలో స్నానం చెయ్యడం , ముగ్గురూ అశ్వని దేవతలగానే కనపడటం , తన భర్త ఎవరో తాను గుర్తుపట్ట లేకపోతే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది కాబట్టి ఆవిడ వెంటనే దేవిభాగవతం లో అమ్మవారిని స్తోత్రం చెయ్యడం , అమ్మవారు అనుగ్రహించి ఆ శర్యాతి కుమార్తె అయిన సుకన్య కి తన భర్తని గుర్తుపట్ట గల బుద్ది ప్రచోదనం చెయ్యడం, దాని వల్ల ఆమె చవన మహర్షి ని  గుర్తుపట్టడం , చావన మహర్షి కి నిత్య యవ్వనం రావడం , మళ్ళి యవ్వనం లోకి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా కాలం గడపటం. దేవిభాగవతం లోని ఈ ఘట్టాన్ని ఒక్కసారి విహంగ వీక్షణం చేశాను.  ఇప్పుడు ఈ చవనమహర్షికి సుకన్య కి ప్రమతి అనే కుమారుడు కలిగాడు. ఈ ప్రమతి గ్రుతచి అనే క్షీర సాగర మదనం జరిగినప్పుడు పాలసముద్రం లో నించి పుట్టిన అప్సరస ని వివాహం చేస్కున్న ప్పుడు వారికి రురుడు అనే పిల్లవాడు పుట్టాడు. ఈ రురుడు గందర్వ రాజైన విశ్వావసుడు , మేనక వీరిద్దరికీ జన్మించిన ప్రమద్వర అనబడే పిల్ల స్తూల కేశుడు అనే ముని ఆశ్రమం లో పెరుగుతూ ఉంటె ఆమెని వివాహం చేస్కుందాం అని సంకల్పం చేసి , నిశ్చితార్దం చేసుకున్నాడు. అంటే తన భార్య అయిపోయినట్టే  ఇoచుమిoగా భార్య అయిపోయినట్టే.  ఒక నాటి సాయంకాలం చె లికత్తె ల  తో కలిసి ప్రమద్వర ఆడుకుంటుంది. ఒక పెద్ద త్రాచుపాము ఒకటి వచ్చి ఆ ప్రమద్వర కాలి ని కాటువేసింది. వెంటనే ఆమె నురగలు కక్కుతూ చనిపోయింది. రురుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన ఏడవ సాగాడు.  నేను నా మనసు ఈమె యందె  పెట్టుకున్నాను. ఈమె ఇప్పుడు చనిపోయిoది  అని ఏడుస్తున్నాడు. ఆ సమయానికి ఋషులoదరు అక్కడికి చేరుకున్నారు.  రురుడు అక్కడ ఉండే వాళ్ళందరిని ప్రార్ధన చేసాడు. దేవతలని కూడా ప్రార్ధన చేసాడు. నేను గురువుల్ని జాగ్రత్తగా సేవించి ఉంటె , హోమాలు ఉంటె,   యజ్ఞ యాగాది క్రతువులు చేసి ఉంటె, గురువులందు భక్తీ కలిగిన వాడనైతే, ఈమె తిరిగి బ్రతుకు గాక, అని ఎవరైనా విషం శరీరం లోకి ఎక్కిన విషం మాత్రతంత్రములతో తీసెయ్య గలిగిన వారుంటే వారికి నేను అధ్యయన ఫలాని , తపోఫలన్ని , గురువుల్ని సేవించిన ఫలాన్ని ధరపోసేస్తాను అని ఏడుస్తున్నాను.
దేవలోకం లో విహరిస్తున్న దేవత అన్నాడు , ఇంత చదువు కున్నావు అంత ఏడుస్తున్నావే , ఒక సరి ప్రాణి శరీరం విడిచి వెళ్ళిపోతే , కర్మ  చేత , అలా అకాలంగా శరీరం విడిచిపెట్టేస్తారు , విదిచిపెట్టేస్తే మళ్లి తిరిగి వస్తారా?
కానీ నిన్ను చుస్తే నాకు జాలేస్తుంది , నీవు ఇంత ఏడుస్తున్నావ్ కాబట్టి నీకు ఒక ప్రత్యేక మైన మినహాయింపు ఇస్తున్నాను. ఎంతకాలం నీకు ఆయుర్దాయం ఉందొ అందులో సగం నువ్వు ఈ ప్రమద్వర కి ధర పోస్తే ఈమె బ్రతుకుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి జీవనం గడుపుడురుగని అన్నాడు. అప్పుడు ఆ ప్రమద్వారకి ఆయన తన ఆయుర్దాయం లో సగ భాగాన్ని ధార పోశాడు, ఆమె బ్రతికింది. ఆయన రురుడు ప్రమద్వరని వివాహం చేస్కున్నాడు , ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అప్పటినించి రురుడు ప్రతిరోజూ ఒక పని చేస్తూ ఉండేవాడు , ఏమిటి ఆ పని అంటే ఆయన చేత్తో ఒక లావు కర్ర ఒకటి పట్టుకునేవాడు, పట్టుకుని వెళ్తూ వెళ్తూ ఆయనకి   పుట్ట ఎక్కడ కనపడితే అక్కడ తవ్వేసేవాడు తవ్వి అందులో ఉన్న పాములన్నీ చంపేసి  వెళ్ళేవాడు.  పాము అన్నది కనపడితే చాలు చంప కుండా వెళ్ళేవాడు కాదు. వెతికి వెతికి మరీ చంపేవాడు.  ఎందుకని తన భార్య ని పాము కరిచింది ఒకసారి అందుకని . ఎంత చిత్రం గా లోపల క్రోధాలు ఉండిపోతాయో చుడండి. పాముకి విషం లేకపోతే దానికి దొరికింది చావదు దాన్ని ఇది మింగలేదు. విషం లేని పాముకి ఆహారం దొరకటం కష్టం. అలాంటి ఒక పెద్ద విషం లేని పాము డుండుభము అనే పేరుగల పాము  రురుడికి   కనపడింది, వెంటనే రురుడు కర్ర తీసి కొట్ట బోయాడు. అది వెంటనే ముని అయ్యింది . ముని అయ్యి అది అంది , నేను విషం లేని పాముని, నువ్వేమో బ్రుగు వంశం లో పుట్టిన బ్రాహ్మణుడివి, బ్రుగువంశం లో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడా పామెక్కడ , ఎందుకయ్యా అలా పాముల్ని చంపుతూ ఉంటావు అంది. ఇప్పుడు రురుడు అన్నాడు చంపడం మాట అలా ఉంచు కొడదాం అని నేను వస్తే , ముని అయిన నువ్వెవరు అన్నాడు, నా పేరు సహస్రపాదు, నేను ఒకప్పుడు వేదం చదువుకుంటూ ఉండేవాడిని , నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు , ఆయన పేరు ఖగముడు ,అతడుకుడా వేదము చదువుకుంటూ అగ్నికార్యం చేస్కుంటూ ఉన్నాడు ఒకరోజునా , నాకెందుకో అక్కర్లేని బుద్ది ఒకటి పుట్టింది.  వీడు అగ్ని కార్యం చేస్తున్నాడు, వీడి మీద పాము అనుకునేలాగా ఏదైనా వేస్తె అతడు పాము అనుకుని ముందుకి పడితే అగ్నిగుండంలో పడతాడు , వెనక్కి పడితే ఎలా ఉంటుందో చూదాం అనిపించింది. వికృత హాస్యo. అర్థం లేని హాస్యం చేస్తే ఇలానే ఉంటుంది.
ఒక గడ్డి పాము తయారుచేసి ఆ పాముని తీసి అగ్నికార్యం చేస్కుంటున్న ఆ ఖగముడి మీదకి విశిరాడు కిటికిలోంచి, అది వెళ్లి అతని మీద పడగానే అతడు అది పాము అనుకుని ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. అతడు లేచి నేను ఎంతో ధ్యానం తో అగ్నికార్యం చేస్తుంటే ఎవడు రా నా మీద ఇది వేసింది అని చూసాడు, స్నేహితుడే సహస్ర పాదుడు. విషం లేని పాము లా ఒక గడ్డి పాముని నా మీద వేసి నేను ఉలిక్కి పడితే నవ్వావు కాబట్టి , విషం లేని పామువై పుట్టి దాని బాధ అనుభవించు అన్నాడు . మితిమీరిన హాస్యo  , అవతల వారిని భాద పెట్టె హాస్యం ఎంత దూరం వెళ్ళిపోతుందో చుడండి. కాబట్టి అర్థం పర్దం లేని హాస్యం మంచిది కాదు , కాబట్టి విషం లేని పాముగా పుట్టాను, అప్పుడు నా స్నేహితుడి దగ్గర ఏడ్చాను , ఎప్పుడు నాకు ఉపసమనం కలుగుతుంది అని అడిగాను . అప్పుడు నా స్నేహితుడు చెప్పాడు, బ్రుగు వంశంలో పుట్టిన బ్రాహ్మణుడు నీకు కనపడతాడు , అప్పుడు అంతా మంచే జరుగుతుంది లే అని చెప్పాడు.
ఇది సరే నువ్వు బ్రుగు వంశం లో పుట్టావే , వేదం చదువుకున్నావు , యజ్ఞం చేస్తున్నావు , ఇలా కర్రపెట్టి పాముల్ని కొట్టచ్చా. బ్రాహ్మణుడు అంటే ఎటువంటి వాడు,ఒక సచ్చీలుడైన బ్రాహ్మణుడు పుట్టగానే ఆ చుట్టు పక్కల ఉన్న వారిలో భూత దయ కలుగుతుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి , అప్పటి వరకు ఉన్న దుష్టమైన ఆలోచనలు పరిశీలనం చేత వేల్లిపోతై,  అందరిని సమానం గా చూసే బుద్ది కలుగుతుంది,అల బ్రతకాలని శత్రాలన్నీ చెప్తున్నాయి , నువ్వేమయ్యా కనపడ్డ పాముల్నల్లా చంపుతూ హింస చేస్తున్నావు ఇలా చేయ్యోచా ? ఇప్పటికైనా ఆపెయ్యి , ఏదో కర్మ వశం నీ భార్య ని పాము కరిచింది , నువ్వు బ్రతికించు కున్నావు .  అక్కడితో దాన్ని విడిచిపెట్టాలి అంతే కానీ కనపడ్డ పామునల్లా చంపుకుంటూ తిరిగితే ఈ హింస వల్ల పాపం నిన్ను కట్టి కుడపదా. నీ తండ్రి యొక్క శిష్యుడైన ఆస్తీక మహర్షి ఒకానొక అప్పుడు , జనమేజయుడు చేసిన సర్పయగాన్నే ఆపాడు , అటు వంశం లో పుట్టిన నీకు పాము లని  చoపడా నికి  సిగ్గుగా లేదా అన్నాడు.  అయ్యా నాకు బుదోచ్చింది ఇంక నేను చంపను అన్నాడు.
అని సౌతి నైమిశా రణ్యం  లో వారికి చెప్పాడు.    







Monday, May 19, 2014

ఆదిపర్వం 7

గురువుగారికి దక్షిణ ని ఇచ్చే కార్యక్రమం పూర్తైన తరువాత , గురువుగారు అనుజ్ఞ ని ఇచ్చారు ఉదంకుడికి వెళ్లి తపస్సు చేసుకో అని, ఆయన తపస్సు ను ప్రారంభం చేసాడు. మీకు ముందు మనవి చేసినట్టు స్వభావము అని ఉంటుంది , ఈ స్వభవమునకు  బలము ఉంటుంది, బలహీనత ఉంటుంది.
శరీరములు పడిపోతూ ఉంటై, శరీరము పడిపోయినప్పుడు,  జీవుడు శరీరము విడిచి వెళ్ళిపోతాడు. 
రవీంద్రనాథ్ టాగూర్ గారు గీతాంజలి లో రాస్తారు , తల్లి పిల్లవాణ్ణి వాళ్ళో పడుకోపెట్టుకుని స్తన్యం ఇచ్చేటప్పుడు, కుడి స్థనన్ని వాడి నోట్లో పెట్టి, వాడి  కడుపు నిండకపోతే, అటు తోడ మీద నించి ఇటు తోడ వైపుకు మార్చుకునే వ్యవధి ఎలా ఉంటుందో , జీవుడు ఈ శరీరాన్ని విడిచి ఇంకో శరీరానికి వెళ్ళడం అలా ఉంటుంది. 
అలా వెళ్ళిపోయెటప్పుడు పెద్ద సమస్య అంత ఎక్కడ వస్తుంది అంటే, ఒక శరీరం వదిలి పెట్టి , ఆ శరీరాన్ని భోగ వస్తువుగా వాడుకుని, దేని మీద అనురక్తిని పెంచుకున్నాడో, ఆ వాసనని పట్టుకువేల్తాడు అదే ఇతర జన్మలలో కనిపిస్తుంది.  ఉదాహరణ కి ఒక శిశువు జన్మిస్తాడు , వాడు పెద్దవాడు అవుతాడు, వాడికి తెల్లని బట్టలు అంటే ఇష్టం , ఎప్పుడు తెల్లని బట్టలే కట్టుకుంటాడు , అది ముందు జన్మ నందు వ్యామోహాన్నిజయిoచిన వాడై ఉంటాడు.  అది గెలిచిన వాసనా బలం. 
అలాగే గెలవని వాసనా బలం అని ఉంటుంది. ఒక వస్తువు పైన వ్యామోహం ఉండిపోతుంది. ఆ వ్యామోహం కూడా జీవుదివెంట వస్తుంది. ఇందులో ఇబ్బంది ఏంటంటే, తాను ఇష్టపడిన వస్తువేదో ఆ వస్తువుని పొందడంలో ప్రతిబంధకం గా ఉన్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడిమీద దీర్ఘ కాలికమైన కోపమును కలిగి ఉండటం,ఇది పతన హేతువులలో ఒకటై కూర్చుంటుంది. ఏమవుతుంది అంటే , చిట్ట చివరికి ప్రాణోత్కర మణం అవుతున్నపుడు, ఎవరిమీదైతే క్రోధం పెంచుకున్నాడో ఆయన గుర్తొస్తాడు. మీరు గమనిస్తే మనసు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది , దానికి ఇష్టం లేని డి కనిపిస్తే ఆగిపోతుంది, ఇష్టమైన డి కనిపించినా ఆగిపోయి స్మరిస్తూ ఉంటుంది. మనసు బాగా పట్టుకునేది ఎక్కడ అంటే ఇష్టమైన చోట ఇష్టంలేని చోట, ఈ రెండు చోట్ల బాగా పట్టుకుంటుంది ,అప్పుడు ఏమవుతుంది అంటే శక్తి క్షీణించి పోతుంది. కోప్పడినప్పుడు క్షీణించిన శక్తి కన్నా ఆ వస్తువు లభించిన సుఖము నందు ఎక్కువ శక్తి క్షీనించిపోతుంది. దీర్ఘ కాలికం గా ఉండే కోపానికి క్రోదం అని పేరు. ఎక్కడ క్రోదం ఉంటుందో అక్కడ కుతంత్రానికి కి అవకాసం ఎక్కువ ఉంటుంది. వాడిని ఎలా పాడుచేయ్యాలి అని ఆలోచన మొదలు పెడుతుoది. అది జీవుడు పతనం అయిపోవటాని  అజ్ఞానం చేత మాయ చేత ఏర్పడే పెద్ద కందకం అది. దాన్ని దాటాక పోతే మళ్ళి ఎన్ని జన్మల తరువాత దాటుతాడో ఎవరికీ తెలియదు. అలా అంటుకుంది ఉండిపోతుంది. మీకు ముందు కనపడతాయి భారతంలో ఘట్టాలు. దీర్ఘ కాలం మనసులో ఉంటె అది ఎలా ఎలా అని మనసులో ఉంటున్నే ఉంటుంది దీర్గ కాలం , అదే  జరిగింది ఉదంకుడి విషయంలో 
ఇంత దర్సనం చేసాడు, గురుదక్షిణ కట్టాడు, గురువుగారి దగ్గర ఆశీర్వచనం పొందాడు. ధన్యుడు అయ్యాడు ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు , తపస్సు చేస్తున్నాడు. చేస్తున్నా అతడికి అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు తక్షకుడు, అప్పడు ప్రార్థన చేశాడు తక్షకుడి కోసం అది ప్రేమ చేత కాదు, లొంగ తీస్కోవటం కొరకు మనసులోంచి వచ్చిన ఒక రకమైన ప్రకోపం. అది పూర్తి పరిణితి వలన కాకపోయింది, దానివలన ఇప్పుడు అతనికి తక్షకుని మీద క్రోధం ఆవహించింది. నేను ఆనాడు పౌష్య మహారాజు దగ్గర నించి కుండలములను తెస్తుంటే, మద్యలో అతడు వాటిని అపహరించాడు, నాగ లోకానికి తీసుకుపోయాడు, నేను తర్వాత ఎంత కస్టపడి తెచ్చుకోవాల్సి వచ్చింది.  నన్నెంత బాధ పెట్టాడు. కాబట్టి తక్షకున్ని పాడుచెయ్యాలి. ఆ పని చెయ్యటానికి రెండు మార్గాలు ఉన్నాయ్ 
ఒకటి తానె పాడుచెయ్యవచ్చు తన తపస్సు చేత శాప వాక్కు ని విడిచి పెట్టడం నీకు ఈ కీడు జరుగుతుంది అని , కాని తానూ అలా చేస్తే తన తపస్సు క్షీణించి పోతుంది, ఆయన ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. 
క్రోదం లో వచ్చే ఆలోచనలు ఎలా అల్లుకుంటాయో  చుడండి. 
నిష్కారణం గా ఒక గురుదక్షిణ తెచుకుంటున్న వాడిని ని ఇబ్బంది పెట్టిన వాడిని ఎవరు శిక్షిoచాలి, రాజే. ఏ రాజు గురుదక్షిణ ఇవ్వటంలో సహకరించాడో ఆ రాజు ఇబ్బంది పెట్టిన వాడిని కూడా శిక్షించాలి. ఇప్పుడు నేనున్న ప్రాంతం జనమేజయుడి చేత పాలింప పడుతుంది , కాబట్టి నేను వెళ్లి జనమేజయుడికి ఫిర్యాదు చేస్తాను. ఇప్పుడు నా తపస్సు ఏమి పోదు కదా. ఇప్పుడు జనమేజయుడికి వెళ్లి ఫిర్యాదు చేస్తే రాజు తక్షకుడిని నాశనం చేస్తాడు.  ఒక్క తక్షకుడు మాత్రమే కాదు , తక్షకుడితో పాటుగా అటువంటి పాములన్నీ నాశనం అయిపోవాలి, అంత కక్ష ఎందుకు అంటే తాను ప్రార్ధన చేస్తే ఎవరూ కనపడలేదు గా . ఇటువంటి ఆలోచనలు వచ్చే ముందు ఒక్కొక్క సారి ఈశ్వర సంకల్పములు కూడా ఉంటాయి, అది ఆయా సందర్భం వచ్చినప్పుడు నేను మీకు వివరణ చేస్తాను. కాబట్టి ఇప్పుడు నేను జనమేజయుడి దగ్గరకి వెళ్లి ఆయన మనసు పాములన్నింటిని నాశనం చేసే విధంగా, ఆయన మనసులో ప్రచోదనం కలిగేట్టు మాట్లాడతాను అనుకున్నాడు. 
కోపంలో ఉన్నావాడు  వెంటనే మాట్లాడితే , నోటి నించి వచ్చే మాట అదుపు తప్పి ఉంటుంది, దానికి ఉచ్చ నీచములు ఉండవు.  మనసు ఇంకా అదుపు లో ఉంచుకుని మాట మాత్రమే వ్యగ్రత తో ఉంది తప్ప మనసు పూర్తి గా తమోగుణ రజో గుణము ల కు పూర్తి గా వశo అయిపో లేదు ఆయన అనటానికి గుర్తు ఏమిటంటే, దేనికి కోపం వచ్చిందో అదొక్కటే మాట్లాడుతాడు తప్ప నింద చెయ్యటం కాని నోటి వెంట పరుష వాక్యాలు విడిచి పెట్టడం కాని అలాంటివి రావు , అంటే అదుపులో ఉంది అని అర్థం. 
ఇప్పుడు ఆయన వెంటనే వెళ్లి జనమేజయుడికి విషయం అంతా చెప్పెశాడనుకోండి, అది ఏదో అతకని విధంగా తన కోపం అంతా వెల్లగక్కి నట్టు ఉంటుంది. కానీ అలా ఉండకూడదు ఇప్పుడు ఆయన కోపం వెళ్ళగక్కటం ప్రధానం కాదు. జనమేజయుడికి కోపం రావాలి తక్షకుడి మీద , తన కోపాన్ని జనమేజయుడి మనసులో పెట్టాలి. పెట్టి  నిజమే నేను తక్షకుడిని తక్షకుడి వంశాన్ని , నాగులని నాశనం చేసేట టు వంటి  బుద్ధి పుట్టాలి.  నేను వెళ్లి ఊరికే ఇలా చెప్తే ఏమయ్యా నీ మనసులో ఉన్న రాగద్వేషాలన్ని నాకు అంటించటానికి వచ్చావా  అందుకు నన్ను వాడుకోవటానికి  వచ్చావా అంటే అదొక అవమాన అవమానం. 
నేను మాట్లాడితే అలా కదయ్యా ఇలా జరిగిందేమో అని అనటానికి అవకాశం ఉండకూడదు అలా  రాజు మనసులో క్రోధం కలగాలి. కాబట్టి నేను ఎలా మాట్లాడితే ఆయన కి బుర్రకి ఎక్కుతుంది, ఇది బాగా సవధానం గా ప్రణాళికా నిర్మాణం చెయ్యటం. ఇది పైకి చూడటానికి అబ్బా ఎంత గొప్ప వ్యూహ రచన చేశాడంది అనిపిస్తుంది.  యదర్థమునకు  అవి జారుడు మెట్లు లాంటివి, ఆ జారుడు మెట్లు మీద ఉన్న వాడి జీవుడు జారిపోతాడు.  నిన్ను మోసం చేసినవాడు ఏ పాపాన్ని పొంది ఉన్నడో,మోసం చేసే వాడి పట్ల చేసే కుట్ర చేత నీవుకుడా అలాగే జారిపోతున్నావు.    ఇప్పుడు ఈశ్వరుడు శిక్ష వేస్తె ఇద్దరికీ సమానమైన శిక్ష వెయ్య వలసి ఉంటుంది.  నువ్వు చేసిన కర్మయే కాకుండా నీ మనసు లో ఇలా చేస్తే బాగుండు అన్న నీ మానసిక వికారానికి కూడా శిక్ష ఉంటుంది. 
క్రౌర్యము తో కూడిన ఆలోచనలు బ్రాహ్మణుడికి అసలు రాకూడదు. ఎందుకంటే ఆయన లోకానికి అంతటికి మార్గాన్ని చూపించ వలసి ఉంటుంది. వెంటనే ఉద్ధరించి అవతలవారిని సంస్కరించే టట్టు గా  ఉండాలి తప్ప, అవతల వారి ఆలోచనని ప్రోత్సహించ కూడదు. 
అటువంటి ఉదంకుడు ఇటువంటి క్రౌర్య ప్రణాళిక చెయ్య కూడదు.  ఆయన జారుడు మెట్ల మీద నిలబడ్డ వాడితో లెక్క.మీరు ఎప్పుడూ  ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీరు ఏ పని చేస్తున్నా నేను ఎప్పుడూ ఈశ్వరునకి జవాబుదారి అని  గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడు ఒక్కడు నా ఆలోచన సరళి ని గమనించ గలిగితే చాలు నాకు ఏ కితాబులు అవసరం లేదు. కృత యుగం లో ఉదంకుడి మనసులో వచ్చిన ఆలోచన కలి యుగం  వరకు నడిచింది. కృత యుగం లో ఆ నాడు కద్రువ ఇచ్చిన శాప ప్రభావం కలియుగం లో ఫలించడానికి ఈయన మాట కారణం అయ్యింది. అంటే దైవము యొక్క శాసనం అమలు కావటానికి ఇవాళ ఉదంకుడు కారణం అయ్యాడు.  రోజో  గుణ ప్రకోపం వలన ఇతను ని వాడుకోవలసి వచ్చింది , అదే రజో గుణ ప్రకోపం లేకపోతే ఇతను కారణం అయ్యేవాడు కాదు ,ఆ అపవాదు ఈయన పైన వచ్చేది కాదు. 
ఇప్పుడు ఆయన జనమేజయ మహారాజు దగ్గర కి వెళ్లి అంటున్నాడు, ఎంత గమ్మత్తు గా ఉంటదంటే మామూలు గా వెళ్లి మాట్లాడినా  అవతల వారి వలన ఒక ప్రయోజనాన్ని  సాధించు కోవాలని ప్రణాళిక వేసుకుని వచ్చిన ఆయన మాటలు చాలా పకడ్బందీ గా ఉంటై. కాబట్టి ఏమన్నాడంటే 
" మిత హిత సత్య వాఖ్యా " నువ్వు  చాలా  మితం గా మాట్లదేవడివి అన్నడనుకోండి ఎక్కువ మాటలు మాట్లాడుకుండా తను చెప్పింది ఒప్పెసుకుంటాడు అని అలా అన్నాడు. జనమేజయుడు తనాన్న మాటని వినేటట్టు ఆయన్ని సిద్దం చేస్తున్నాడు.
జనమేజయ నేను చాలా మంచివడినయ్యా నేను గురుదక్షిణ తేవటానికి వెళ్లి వస్తున్నాను , నేను పవిత్రమైన పని మీద ఉన్నాను అని తెలిసి కూడా, ఇది చెయ్య వలసిన పని, ఇది చెయ్యకూడని పని అని పూర్తిగా  మర్చిపోయి, పెద్దల పట్ల ఎలా ప్రవర్తిoచాలో పూర్తిగా విస్మరించి, కుటిల స్వభావుడై అవతల వారిని మోసం చెయ్యటమే తన ఆలోచన గా పెట్టుకున్న వాడై ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి నువ్వు శిక్ష వెయ్యాలి.
ఇప్పుడు రాజు మనసు ఎటువైపు వెళ్తుంది, ఆయన నిష్పాక్షపాతం గా ఆలోచన చేస్తాడు. పోన్లెండి జరిగింది ఏదో జరిగి పోయింది ,మీరు బ్రాహ్మణులు మీ మనసు వెన్నపూసలా ఉండాలి మీకంత కోపం ఉండకూడదు అని అన్నాడనుకోండి , ఈయన కోపం తీరదు.  రాజు మనసులో క్రుర్యం లేదు కాబట్టి పోన్లెండి అని వదిలేస్తే వదిలెయ్యొచ్చు లేదా తననుకున్నంత శిక్ష వేసి ఉండక పోవచ్చు.   ఆయన మనసు వ్యగ్రత  ఎలా ఉందంటే తక్షకుడు నశించాలి. తక్షకుడి తో సరిపోకూడదు , తక్షకుడి తో పాటు నాగులన్నీ నశించాలి. కాబట్టి ఇప్పుడు తనకి ఎంత కోపం ఉందొ అంత కోపం జనమేజయుడికి రావాలి. కాబట్టి ముందు  తనెందుకు వచ్చాడో తన గురించి చెప్పాడు. ఇప్పుడు ఇంకో మాట చెప్పాడు. ఆ తక్షకుడు నాకు మాత్రమే అపకారం  చెయ్య లేదు. మహానుభావుడు అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దానం చేసిన వాడు నీ తండ్రి, భారత వంశాన్ని అంతటిని పెంచినవాడు, సకప్రజల ల యొక్క హితమును కోరి పరిపాలన చేసిన వాడు.  అర్జనుడితో సమానమైన వాడు. నీ తండ్రి పరిక్షిత్తు. పరిక్షిత్ మహారాజుని ఆ తక్షకుడు ఏమి చేసాడో తెలుసా ,భయంకరమైన తన యొక్క విషము అనే అగ్ని జ్వాలలకు చేత దహించి యమదర్మ రాజు సదననికి అతిదిగా పంపించాడు . లేకపోతే నీ తండ్రి ఇంకా ఎంత కాలం రాజ్యం చెయ్య వలసింది. నీ తండ్రిని ఆ తక్షకుడే పొట్టన పెట్టుకున్నాడు. ఈ మాట అనే  సరికి ఎంత కాదన్నా జనమేజయుడిలో తాను కోరిన స్పందన వస్తుంది.
తక్షకుడు ఎందుకు చంపాడు , ఒక బ్రాహ్మణ వక్కుకి చంపాడు. శృంగి అనబడే టటువంటి మహర్షి కుమారుడు ఒకడు శపించాడు. నేటికి ఏడవ రో జు  తక్షకుని యొక్క విషము చేత మరణిస్తావు అని శాప వాక్కు విడిచి పెట్టాడు. ఆ శాప వాక్కు నిజం అవ్వాలి కాబట్టి తక్షకుడు వచ్చి చంపాడు.
తక్షకుడు మీ నాన్న ని ఎందుకు చంపెశాడో తెలుసా, తక్షకుడికి మీ నాన్న గారికి ఏమి వైరం లేదు. ఎవరో ఒక బ్రాహ్మణుడు మారు పలక లేదని , మీ తండ్రి ఆయన మేడలో మృత సర్పాన్ని వేశాడు. తండ్రి మేడలో మృత సర్పం వేశాడన్న మాట కి నేటికి ఏడవరోజు నీవు తక్షకుడి చేత మరణిస్తావు అన్నాడు. అంటే ఇప్పుడు తక్ష్కుడికి రెండు మార్గాలు ఉన్నాయ్. శృంగి మాటకి చంపెయ్యటం , చంపకుండా ఉండటం. ఎందుకు చంపకుండా ఉండాలి మీ
నాన్న ఎంత గొప్ప వాడో ఇందాకే చెప్పను కదా. అర్జనుడితో సమానుడు , లోకమునంతతిని కూడా గొప్ప గా పరిపాలించిన వాడు. నిరంతరమూ పరమ భక్తితో యజ్ఞ యాగాది క్రతువులు చేసిన వాడు అటువంటి వాడిని ఒక బ్రాహ్మణుడు తక్షకుడు చంపుతాడు అన్నందుకు వెళ్లి చంపేశాడు తప్ప ఆ బ్రాహ్మణుడి దగ్గరకి వెళ్లి మద్యలో దొరికేది నేనా నీకు నేను చంపుతానని శాపవక్కు ఎందుకు విదిచిపెట్టావ్ ? నేనేనెందుకు చంపాలి పరిక్షిత్తు ని . పరిక్షిత్ లాంటి ప్రభువు శరీరం విడిచిపెడితే, ఈ లోకానికి మళ్ళి అంత ధర్మాత్ముడైన ప్రభువు ఎక్కడ ఉంటాడు? ఎందుకంత వాక్కు విదిచిపెట్టావ్ , నేను నీ మాట వినను , నేను కరవను, అలా కరవ కుండా ఉంటె నాకుకూడా శాప వాక్కు ఇస్తే ఇవ్వు , ధర్మ నిరతుడైన ప్రభువు కొరకు ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్దమే అని అనగలిగాడా ?తక్షకుడు.  తనలో ఉన్న క్రోదం ఏ స్థాయి లో ఉందొ అదే స్థాయిలో ఆయన లోకి కూడా పంపించేశాడు , ఇప్పుడు పరిష్కారం కూడా ఆయనే చెప్పేసాడు,   ప్రత్యేకించి ఇప్పుడు నేనేమి చెయ్యాలని జనమేజయుడు ఆలోచించకుండానే ఉదంకుడు పరిష్కారం కూడా చెప్పేసాడు. అతడు అన్నాడు, ఒక్క బ్రాహ్మణుని మాటకి తక్షకుడు మీ నాన్నని చంపేసాడు , నువ్వూ పదిమంది రుత్విక్కులని తీస్కోనివచ్చి , వారoదరు  కలిసి ఒక్కొక్క పాము పేరు చెప్పి స్వాహ అంటారు ఆ పాము పడిపోవాల్సిందే.  బ్రాహ్మణుడు చెప్పిన మాటకి తక్షకుడు మీ నాన్న ని చంపెయ్యవచ్చా , అదే బ్రాహ్మణుని మాటకి ఆ పాములు వచ్చి అగ్నిలో పడకూడద  ? మీకొక న్యాయం వారికొక న్యాయమునా ? వాళ్ళని వచ్చి పడిపోమ్మను, చిట్ట చివరికి తక్షకాయ స్వాహా అనమను ఆయన కూడా వచ్చి పడిపోతాడు అన్నాడు .  అప్పుడు పగ తీరుతుంది రాజా అన్నాడు.  తండ్రిని చంపిన వాడు అక్కడ హాయిగా తిరుగుతూ నాలాంటి బ్రహ్మ చరుల్ని ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఇక్కడ చూస్తూ కుర్చుంటావా , కాబట్టి సర్ప యాగం చెయ్యి, రుత్విక్కులని పిలిపించు , పిలిపించి స్వాహా కరం తో పదగొట్టు పాములని అన్నాడు. ఇక్కడ రాజు ఒక మాట అనొచ్చు తక్షకాయ స్వాహా అని యాగం అన్నా చేయిస్తాను , లేకపోతే నేనే వెళ్లి తక్షకున్ని చంపుతాను. తక్షకుడు మా నాన్న ని చంపితే పాములన్నింటిని నేనెందుకు చంపటం అవేమి చేశాయి, అవేమి చంప లేదు గా మా నాన్న ని అవేమి ద్రోహం చెయ్యలెదుగ మా నాన్నని, నీకు వాళ్ళెవరు ద్రోహం చెయ్యలేదు కదా కాబట్టి తక్షకుడి జోలికి వెళ్తాను లే అన్నాడనుకోండి , తాని నాగలోకానికి వెళ్లి ప్రార్ధన చేసినప్పుడు వాళ్ళెవరు తనకి పలకలేదు అన్న కోపం ఎలా పోతుంది. అసలామాట రాకుండా  తాను  మాట్లాడాలి  అందుకే అన్నాడు ఏమి రాజా  పూర్వపు నీతి వినలేదా ఒక కులం లో ఒక దుర్మాగుడు   జన్మిస్తే మొత్తం కులం అంతా నాశనం అవుతుంది.  ఇంతటి దుర్మార్గుడు ,ధర్మాత్ముడైన పరిక్షిత్ నే చంపినటువంటి తక్షకుడు జన్మించిన కులం నశించిపోవద్దు. కాబట్టి ఆ పాములన్నీ పోవాల్సిందే . ఇవాళ తక్షకుడు రేపు నోట్లో  విషమున్న పాములు రేపు ఇంకొకళ్ళ జోలికి వేళ తాయి , కాబట్టి పమన్నది ఉండకూడదు. ఇలా ఉదంకుడు అంటే జనమేజయుడు ఒక్కమాట కూడా మాట్లాడినట్టు లేదు.  ఉత్తర క్షణము జనమేజయుడు నువ్వు చెప్పింది నిజమే నేను సర్ప యాగం చెయ్యాల్సిందే అని రుత్విక్కులని పిలిచి కూర్చోబెట్టి , మీరంతా సర్పయాగం చెయ్యండి . ఈ సర్ప యాగం చేత లోకంలో ఉండే నాగులన్ని కూడా ఈ అగ్నిహోత్రం లో పడిపోయి మరణించ వలసిందే అని సంకల్పం చేసేశాడు అంతే.
బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే చాలా కోపం వచ్చిన వ్యక్తి , చాలా కోపం లో ఏ ప్రణాళిక నిర్మాణం చెయ్యరాదు.
మహాభారతం లో ఏ ఒక్క విషయమైన   సమాజం లో ఏ కాలము నందైన ఏ ఒక్కరికైన అన్వయం కాదు అని చెప్పడానికి లేదు. నన్నయ్య గారు గుండెల మీద చెయ్యి వెస్కొని చెప్పారు.
ఇప్పుడు ఇదంతా వింటున్న వాళ్ళెవరు, నైమిశారణ్యం లో కూర్చున్న వాళ్ళు , వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. "అన్నన్నా ఎంత మాట అయ్యా జనమేజయుడు సర్పయాగం మొదలు పెట్టాడా ? అందులోకి వచ్చి పాములన్నీ రాలిపోతాయ , పాములన్నీ కాలిపోతయా ? అగ్నిహోత్రుడికి ఒక లక్షణం ఉంది , ఆయన హవ్యవాహనుడు,  ఏదైనా మంత్రం చెప్పి ఆయన లోకి బ్రాహ్మణులూ వేస్తే దేనికొరకు పుచ్చుకుంటాడు అంటే దేవతలకి పట్టుకెళ్ళటానికి పుచ్చుకుంటాడు. హవ్యం కానీ కవ్యం కానీ పిత్రుదేవతలకి ఇస్తే కవ్యం అంటారు, దేవతలకి ఇస్తే హవ్యం అంటారు. ఈ రెండిటిని వాళ్ళకి అందజేయ్య వయ్యా అంటే వాళ్ళకి  పట్టుకెళ్ళి ఇస్తాడు. అగ్నిహోత్రుడి ముఖంగా వెళ్తే అది ఎంగిలికాదు పవిత్రం అవుతుంది. మరిప్పుడు సర్పయాగం లోపడిన పాముల్ని ఎవరికీ పట్టుకెళ్ళి ఇవ్వటానికి , ఎవరికీ పట్టుకెళ్ళి ఇవ్వటానికి కాదు , ఏమి చెయ్యాలి , అగ్ని  కాల్చాలి , మరి అగ్ని హోత్రుడు తిరస్కరించడా ?
ఆయన ఎలా కాల్చాడు , జనమేజయుడు ఎలా చేసాడు? పోనీ ఈ జనమేజయుడు చేసిన సర్ప యాగం లో పాములన్నీ పడిపోతే పాములు ఉండకూడదు కదా , పాముల జాతి అంతరించి పోకుండా పాములు
ఉన్నాయి అంటే అన్ని పాములు పడలేదుగా కొన్ని పాములు ఉండి పోయాయి , కొన్ని పాములు ఉండిపోయాయి అంటే ఆ యాగం పూర్తి అవ్వలేదుగా, మద్యలో ఎక్కడో ఆగిపోయిoదన మాట , మరి అలా ఎలా ఆగిపోయింది యాగం? కోపం ఉన్న వాడు యాగం మొదలు పెడితే కోపం తీరేవరకు జరుగుతుంది.  మరి కోపం ఎలా తీరింది , పరిక్షిత్ బతికాడ లేదుకదా మరి ఎందుకు ఆగింది యాగం.  అయ్యా మాకు చాల ఆత్రుత గా ఉంది సుమా ఈ విషయాలన్నీ వినేయాలని, మాకు బాగా అర్థమయ్యే లాగా ఓ మహానుభావా సౌతి చెప్పు వింటాం అన్నారు వారంతా .
కాబట్టి ఆ సూతుని కుమారుడైన సౌతి (ఉగ్రశ్రవసుడు) అంతే అందంగా చెప్పటం మొదలు పెట్టాడు .
ఆయన భ్రుగు వంశం నించి మొదలు పెట్టాడు. ఆ భ్రుగువు ఆయన భార్య పులోమ వాళ్ళిద్దరూ ఆశ్రమం లో అన్యోన్యం గా జీవితం గడుపుతున్నారు. గృహస్తాశ్రమం లో జీవితం ఎలా ఉండాలో భ్రుగువు జీవితాన్ని అలా గడుపుతున్నాడు. గృహస్తాశ్రామము అన్న మాటకి అర్థం ఏమిటంటే నా భార్య ఇంట్లో నేను ఉంటున్నాను అని అర్థం అది ఎలా సంభవం అంటే , గృహము అంటే ఇల్లు , అప్పటివరకు తనకి ఇల్లు లేదు ఎందుకంటే గురువుగారి ఆశ్రమం లో కూర్చున్నాడు గురువుగారు చెప్పిన పాఠం వింటాడు , వేదాన్ని వల్లే వేస్తాడు , సంధ్యా వందనం చేస్తాడు, అగ్నిహోత్రంలో సమిధలు తీస్కోస్తాడు . గృహస్తాశ్రము నందు ఏమవుతుంది అంటే చాల నియమల్ని వదిలి పెట్టేస్తాడు. గృహము అంటే ఇల్లు , గృహస్తు అంటే ఇంటి యందు ఉన్న వాడు , ఎవరి ఇంటి యందు గృహిణి అంటే గృహము తనదిగా కలది. వ్యాపారం చేసి డబ్బు పట్టుకొచ్చాడు , ఆయన డి కాదు ఆవిడది. వేదాంతం లో ఆవిడదే ఆ డబ్బు . ఆవిడదైన ఐశ్వర్యం దగ్గరకి వెళ్లి ఈయన కూర్చున్నాడు ఆ ఇంట్లో . అందుకే ఆవిడ కుర్చోనిచ్చింది , అందుకే ఆడపిల్ల ఎప్పటికీ తండ్రిదే. ఆడపిల్ల గురించి మాట్లాడే అధికారం ఎప్పుడు తండ్రికి ఉంటుంది.  ఉభయ వంశాలని తరిమ్పచేస్తుంది. కాబట్టి అమ్మాయి ఇంట్లో అల్లుడు గారు ఉన్నారు తప్ప అల్లుడిగారి ఇంట్లో అమ్మాయి ఉంది అని వేదాంతం లో చెప్తే తప్పు అది. గృహస్తాశ్రామము అన్న మాటకి అర్ధం ఏమిటంటే ఆవిడ దైన ఇంట్లోకి ఈయన వెళ్తాడు.













  

Thursday, May 15, 2014

ఆదిపర్వం 6

బ్రాహ్మణుని యొక్క హృదయము అంత ప్రసన్నం గా అంత మెత్త గా ఉంటుంది. ఇప్పుడు ఆ కుండలములను పట్టుకున్నాడు వెళ్ళిపోతున్నాడు. వెళ్లిపోతు వెళ్ళిపోతూ ఆయన కి ఆచమనం చెయ్య వలసిన అవసరం వచ్చింది . శరీరానికి కొన్ని కొన్ని అవసరములు ఉంటాయి. లోపల ఉన్న పదార్ధాన్ని విసర్జించ వలసి ఉంటుంది. బయట ఉన్న పదార్థాన్ని లోపలి తీస్కోవాల్సి ఉంటుంది. ఆయా అవసరములు తీర్చుకున్నప్పుడు ఆచమనం చెయ్య వలసి ఉంటుంది. ఆచమనం చెయ్యాలి కాబట్టి ఒక నడివడ్డున ,ఇక్కడ మలమూత్ర విసర్జన జరగదు అని నమ్మి, కుండలములను నదివోడ్డున పెట్టి ఆచమనం చేస్తున్నాడు, చేస్తూ ఉంటె  తక్షకుడు  దిగంబరుడిగా , ఇంక లోకంలో అంతకన్నా అపవిత్రమైన స్థితి ఉండదు , అటువంటి స్థితిలో వచ్చి ఆ కుండలములను పట్టుకు పారిపోతున్నాడు. వెళ్లిపోతుంటే ఉదంకుడు వెంటపడ్డాడు , వెంటపడుతుంటే తక్షకుడు నాగరాజు గా మారి అక్కడే ఉన్న ఒక పుట్ట  కలుగులో కి వెళ్ళిపోయాడు.  గురుపత్ని నేటికి నాల్గవ రోజు వాటిని ధరిస్తాను, ఈలోపు దానికి కావలసినట్టుగా స్నానం చేసి సిద్దంగా ఉంటాను అంది గురుపత్ని. ఈలోపల ఈయన కుండలములు తీస్కొని వెళ్ళాలి.
ఇప్పుడు గురువుగారి దగ్గర చదువు నేర్చుకునే రోజులలో తనత తాను గా వచ్చిన అష్ట సిద్దులు ఉన్నాయే , అవి వాడుకుందాం అని ఆయన ఎప్పుడు అనుకోలేదు. అందుకనే పౌష్య మహారాజు దగ్గరికి నడిచి వెళ్ళాడు , పౌష్య మహారాజు దగ్గర నించి నడిచి వచ్చాడు.  లేకపోతే వాయుగమనం చేసి వెళ్ళిపోతారు. అసలు వాటిని వాడుకోవాలన్న కోరిక ఆయనకి లేదు, ఇప్పుడు వాటి అవసరం వచ్చింది, ఎందువలన వచ్చింది అంటే ఇప్పుడు గురుదక్షిణ సమయా నికి చెల్లించ వలసి ఉంది , కాబట్టి ఇప్పుడు ఆ అష్ట సిద్దులని ఆధారం చేస్కుని, తాను  కూడా తక్షకుడు వెళ్ళిన పుట్టలోనించి నాగలోకానికి వెళ్ళిపోయాడు.తీరా నాగలోకానికి వెళ్ళాక ఎవ్వరూ కనపడలా అంతా నిశ్శబ్దం గా ఉంది. ఇప్పుడు ఆయనకి ఆ నాగరాజులు కనపడాలి, కనపడి ప్రసన్నం అవ్వాలి, ప్రసన్నం 
అయితే అయ్యయో కుండలములు తీస్కుని వెళ్ళిపో అని ఇచ్చేసెయ్యాలి.  కాబట్టి ఇప్పుడు ఆయన ఆ నగరజులకి ప్రార్ధన చేసాడు. నాగరాజులు మహా తపస్సంపన్నులు, దేవతా స్వరూపాలు, ఆదిశేషుడు వంటి వారు ఉన్నారు కాబట్టి, దేవతా స్వరూపాల్ని ప్రసన్నం చేస్కోవాలి. అంతే తప్ప మీకు ఉన్న సామర్ద్యం తో వాటి మీద అధికారం చలాయించ కూడదు. 
సుందర కాండ లో హనుమంతుడు అంతటి వారు లంకని వశం చేస్కున్నారు, చంపటం కుదరదు. కాబట్టి దేవతలని ప్రసన్నం చేస్కోవాలి.  దేవతలకి ఒక లక్షణం ఉంది , దేవతలు కనపడ్డారనుకోండి, మీకు ఏమి కావలి అని అడుగుతారు. మీరు ఒకసారి అడిగేసిన తరువాత , అయ్యయో ఏదో సరదాకి అడిగాను అంటే వాళ్ళు వదలరు ఇచ్చేస్తారు . ఇప్పుడు వాళ్ళు కనపడాలంటే ప్రార్ధన చెయ్యాలి ప్రార్ధన చేస్తే కనపడతారు, కనపడితే కోరిక తీరుస్తారు. 
ఇప్పడు ఆయన ప్రార్ధన చేసాడు. 
ఆయన మొట్ట మొదట అనంతుడు అనే నాగ రాజు  గురించి ప్రార్ధన చేస్తున్నాడు.  కుల పర్వతాలతో పెద్ద పెద్ద పర్వతములతో , నదులతో ,  వనములతో ఈ భూమిని అంతటిని మోసే ఆది శేషుడు ఎవరైతే ఉన్నడో ,ఆయన ఈ భూభారాన్ని మోయ్యట మే కాకుండా, ఇటువంటి బ్రహ్మoడము నంతటిని తన బొజ్జలో పెట్టుకున్న శ్రీమన్నారాయణుడు పాల సముద్రం పైన పడుకొని ఉండగా , ఆయనని కూడా వహించగల శక్తి కలిగిన ఆది శేషుడు ఎవరున్నారో, అనంతుడు ఎవడున్నాడో ,ఆయన మాకు ప్రసంనుడయ్యేడున్. ఆయన  ఏ జాతిలో పుట్టాడో ఆ జాతికి దేవతల వలన రాక్షసుల వలన ఆపదలు రాకుండా గొప్ప తప్పస్సు చేసి , దేవతల చేత రాక్షసుల చేతా నమస్కరింప బడే వాడు. దేవతలు ,రాక్షసులు కూడా నమస్కరిస్తుంటే ఇరువురు యొక్క అలంకరములైన కిరీటములలో పొదగబడిన మణుల యొక్క కాoతు ల చేత ప్రకాశించే ట వంటి పాద పద్మములు కలిగిన పరమేశ్వరునికి ఆభరణము గా భాసించెడి వాసుకి మాకు ప్రసన్నం అయ్యేడు గాక. అని  ప్రా ర్థన చేసాడు. 
దేవలోకంలో మనుష్య లోకం లో తిరుగుతూ , అపారమైన కోపం తో ఉంటూ, తమ యొక్క విషం చేత దేన్నైనా కాల్చే ట టు వంటి శక్తి కలిగిన వారై, మహానుభావులై ఐరా వత  వoశo లో జన్మించిన వారందరు కూడా మాకు ప్రసంనంమయ్యేడున్. 
తక్షకుని గురించి ప్రార్థన చేస్తూ "పెద్ద పెద్ద పర్వతాల దగ్గర పుట్టలలో తిరిగే ట టు వంటి లక్షణం ఉన్న తక్షకుడు కన్ను చెవి యొక్క శక్తిని ఒక ఇంద్రియము నందే పెట్టుకున్న వాడు, అంటే చూస్తుంటే వినని వాడు , వింటుంటే చూడని వాడు , ఆ శూరుడైన తక్షకుడు మాకు ప్రసంనంయ్యేడు గాక "
 ఆయన ఆ నాగులను అన్నింటినీ కూడా స్తోత్రం చేసారు కాని ,వారెవ్వరూ ఆయనకి కనపడలేదు. అక్కడ ఒక గుర్రం మీద కుర్చున్నటువంటి ఒక పురుషుడు ఒకడు దర్శనం ఇచ్చాడు. ఆయన అన్నాడు "నాయన నా దగ్గరకి వచ్చి గుర్రం  చెవిలో ఒకసారి ఊదమన్నాడు , ఆయన నమ్మి ఆ గుర్రం దగ్గరకు వెళ్లి దాని చెవిలో ఒకసారి ఊదాడు. 
ఆ చెవిలో ఒక్కసారి ఊదేసరికి ఒక్కసారి పెద్ద అగ్ని హోత్రo  లేచింది , అది ప్రళయ కాలం లో వచ్చే అగ్నిలా వచ్చింది, ఒక్కసారి ఆ నాగ లోకన్నంతటిని చుట్టు ముట్టింది , ఆ చుట్టు ముట్టిన అగ్ని హోత్రానికి జడిసి గబా గబా తక్షకుడు బయలు దేరాడు. ఆయన అనుకున్నాడు పరమశివుని ఆగ్రహం ఎటు వంటిదో, తపో నిష్టా గరిస్టుడైన బ్రాహ్మణుని ఆగ్రహం అటువంటిది. కాబట్టి నేను చేసిన తప్పు దిద్దుకోవటము అంటే నేను తెచ్చిన  తాటంకములను/కుండలములను తిరిగి ఇవ్వటమే అని గబ గబా వచ్చి ఆ కుండలములను ఆయన చేతిలో పెట్టాడు.  ఇప్పుడు ఉదంకుడు అష్ట సిద్దులు కలిగిన వాడు ఇప్పుడు త్వరగా వెళ్ళాలి మా గురుపత్ని దగ్గరకి వెళ్ళాలి . ఎలా వెళ్ళాలి అని ఆ దివ్య పురుషుణ్ణి అడిగాడు. ఇదిగో ఈ గుర్రం ఎక్కి వెళ్ళు అన్నాడు. అక్కడే ఒక ఆశ్చర్య కరమైన  సంఘటన ఉదంకుడు. ఒక రాట్నం , ఆ రాట్నం దగ్గర తెల్ల దారాలు ,నల్ల దారాలు ఉన్నాయ్. ఇద్దరు ఆడవాళ్లు అక్కడ కూర్చొని ఉన్నారు , వాళ్ళిద్దరూ ఆ తెల్ల దారాలు , నల్ల దారాలు కండేకి కి చుడుతూ ఉన్నారు . పన్నెండు  ఆకులు కలిగిన చక్రము ఒకటి ఉంది. ఆ చక్రాన్ని బలిష్టమైన ఆరుగురు యువకులు తిప్పుతున్నారు. ఆ సన్నివేశం చూశాడు.  ఇప్పుడు ఆ దివ్య పురుషుడు నువ్వు ఈ గుర్రం ఎక్కి వెళ్ళిపో అన్నాడు. ఈయన గుర్రం ఎక్కాడు, వెంటనే సంకల్పం చెప్పాడు, వెంటనే గురుపత్ని దగ్గరకి వెళ్ళాడు. ఆవిడ అప్పుడే స్నానం చేసి , సుముహూర్తం అవుతోంది వచ్చాడా కుండలాలు తీస్కొని అని చూస్తోంది.  అమ్మా వచ్చానమ్మ అని గబగబా కుండలాలు తీస్కొని అని అన్నాడు. గురుపత్ని ఆ కుండలాలు పెట్టుకుంది. గురువుగారు గురుదక్షిణ ఇచ్చాను ఎంతో సంతోషం గా ఉంది అన్నాడు. ఇస్తే గురువ్గారు సంతోస్తారు అని కాదు, ఇచ్చి నేను సంతోషించాను, ఇప్పుడు ఆ  చదువుకి  సార్ధకత. 
కానీ గురువుగారూ నాకు ఒక అనుమానం, నేను నాగ లోకం వెళ్ళినప్పుడు ఒక రాట్నం కనిపించింది, ఇద్దరు యువతులు కనపడ్డారు, తెల్ల దారాలు నల్ల దారాలు కనపడ్డాయి. అక్కడ వాళ్ళు తెల్లదారాన్ని నల్లదారాన్ని తెర్చి ఆ కండె కి  అమరుస్తున్నారు. పన్నెండు ఆకుల చక్రాన్ని బలిష్ట మైన ఆరుగురు యువకులు తిప్పుతున్నారు, అక్కడ ఒక గుర్రం మీద ఒక దివ్య పురుషుడు కూర్చొని ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఒక దివ్య పురుషుడు ఒక ఎద్దు మీద కూర్చొని నాచేత పేద తినిపించాడు, ఇవన్ని ఏమిటో, తెలుసుకోవాలి అని ఉంది గురువుగారు అన్నాడు. 
పైలుడు విడమర్చాడు "నువ్వు గురువుగారిని సేవించావు కదా , గురువుమీద నమ్మకం పెట్టుకున్నావ్ కదా, గురు దక్షిణ కట్టాలని కదా వెళ్తున్నావు. గురుపత్ని అడిగింది అని బయలు దేరావ్, నీయొక్క చిట్టా శుద్ధికి మెచ్చుకున్నారు దేవతలు. మెచ్చుకుని అటువంటి కుండలములను తీస్కురవటానికి నీకు శక్తి ని ఇవ్వటానికి దేవేంద్రుడు ఐరావతాన్ని ఎద్దుగా మార్చుకు ఎద్దుగా మార్చుకుని నీకు కనపడ్డాడు, ఆ ఎద్దు పేడ వేసిందే అది పేడ కాదు అమృతం. నీతోటి అమృతాన్ని తినిపించాడు దేవేంద్రుడు. అంత మహా పతివ్రత ధరించిన కుండలములను పట్టుకోవాలంటే నువ్వు అమృతం తాగిన వాడై ఉండాలి. కాబట్టి నువ్వు ఆ కుండలములు పుచ్చుకుని, పుచ్చుకుని నువ్వు వస్తున్నప్పుడు తక్షకుడు వాటిని ఎత్తుకు పోయాడు, నువ్వు నాగ లోకానికి వెళ్ళావ్. అక్కడ ఒక పెద్ద రాట్నం దగ్గర ఇద్దరు స్త్రీలు కూర్చున్నారు వారు ధాత ,విధాత. ధాత అంటే  అర్థం ఏమిటంటే మళ్ళి మళ్ళి ఈ సృష్టిలో ఈశ్వరుని యొక్క ఒక స్వరూపమునకు ధాత అని పేరు. ఆయన జీవుడు ఏమి సంకల్పిస్తున్నాడో రాస్కుంటాడు , ఆ కర్మ ఫలితం గా మళ్ళి ఇంకో కొత్త శరీరాన్ని ఇస్తాడు. మళ్ళి రాసుకుంటూ ఉంటాడు. మళ్ళి ఆ కర్మ ఫలితం గా కొత్త జీవితం ఇస్తూ ఉంటాడు. ఇదిగో ఈ పాపం చేసావ్ , ఫలితం అనుభవిoచు ఈ పుణ్యం చేసావు  కనుక ఈ ఫలితం అనుభవించు, అలా ఫలితం అనుభవించడం చేత పాపం పోతుంది , పుణ్యం పోతుంది. అని పాప రూపములో కర్మలను ఆచరింప చేసే శక్తి స్వరూపమునకు విధాత అని పేరు. ఆ ఈశ్వరుడిని రూపములే నీకు సృష్టి కర్త గా లయకర్త గా ప్రలయానంతర సృష్టి కర్త గా మూడు మూర్తులుగా తిరిగే ఈశ్వరుడే రెండు రూపములలో నీకు అక్కడ కనపడింది. వాళ్ళు తెల్ల దారములు నల్ల దారములు పట్టుకున్నారు , అవే అహోరాత్రములు ,కాలముగా ఈ లోకమును తిప్పుతూ ఉంటాడు ఈశ్వరుడు ఆ కాలం లో తెల్లగా ఉన్న దారాలన్నీ పగళ్ళు , నల్ల గా ఉన్న దారాలన్నీ రాత్రిళ్ళు . పన్నెండు ఆకుల చక్రమే పన్నెండు నెలలు కలిగినటువంటి సంవత్సరం. కాలం లో సంవత్సరం ఒక ప్రమాణం , ఉపాసన లో కూడా, పన్నెండు నెలలు ఆ చక్రమునందు ఆకులుగా ,ఆ చక్రమును తిప్పే ఆరుగురు పురుషులు ఆ కాలమునందు ప్రక్రుతిలో వచ్చే తతువంటి ప్రబల మైన  మార్పు ని వ్యక్తీకరించే ట టు వంటి ఋతువు, ప్రకృతి లో మార్పు వస్తుంది. మొట్ట మొదట వచ్చేది 
వసంత ఋతువు, తరువాత
గ్రీష్మ ఋతువు 
వర్షఋతువు 
శరదృతువు 
హేమంత ఋతువు 
శిశిర ఋతువు 
ఈ రుతువులే అక్కడ బలిష్టమైన యువకులుగా ఉండి సంవత్సరం అనే చక్రాన్ని తిప్పుతున్నారు. 
తయారు అవుతున్న పటలం ఉన్నదే అదే వస్త్రము. బట్ట  తెలుస్తుంది , దారములు తెలియవు. 
మాయ చేత సంసారము నందు ఉంటాడు బ్రహ్మము తెలియదు. సంసారము నందు కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాడు. ఆ ఈశ్వరుడే ఈ ప్రణాళిక ని చేస్తున్నాడు. అందరికి కనపడేది సంవత్సరం , ఋతువులు తెలుస్తాయి , చలి తెలుస్తుంది ,ఆకులు రాలటం తెలుస్తుంది ఎండ గ్రీష్మo  తెలుస్తుంది, వర్షం తెలుస్తుంది కానీ నువ్వు గురువు పరిచర్య చేసి నందు వలన కాలాత్మకము గా ఉన్న ఈశ్వర స్వరూపము  స్తూలమైన వ్యక్తులు గా నీకు దర్శనం అయ్యింది. దీనికంతటికి కారణం నువ్వు చేసిన గురుసుసృష , నువ్వు చదువకున్న చదువు , వీటి వలన నీకు కాలత్మకం గా నీకు శ్రీ మన్నారయణుని దర్శనం జరిగింది.  నువ్వు  అదృష్ట వంతుడువిరా అమృతాన్ని తిన్నావ్ అన్నాడు. 
మనకి కాలమును ఈశ్వర స్వరూపముగా చూడటం చేత కాక కాలమును 9 మనములుగా లెక్క పెడుతూ ఉంటాము. 
1. బ్రహ్మ 2. దివ్య  3.పైత్రు 4. ప్రాజాపత్య 5.బహ్యస్వత్య 6. సౌర 7. సావన 8. చంద్ర 9. నక్షత్ర అని 9 మానములు గా లెక్కపెడుతూ ఉంటాము . ఇందులో కొన్ని ఉర్ద్వ లోకాలలో ఉండేవి, కొన్ని భూలోకం లో ఉండేవి ఇటువంటి మనముల చేత కాలాన్ని లెక్కపెడుతూ ఉంటారు. 
గుర్రము కి అశ్వము అని పేరు. అశ్వము అనగా గమనము చేత వ్యాప్తిని పొందినది అని అర్థం. అంటే తానూ ఎక్కడే క్కడికి వెళ్తుందో అక్కడక్కడ వ్యాపిస్తుంది.  భూత భవిష్యత్ వర్తమాన అని ఉన్న ఒక కాలాన్నే 3 భాగములు చేసి కదలడం లో ఈశ్వరుడు వ్యాప్తి చెందుతూ ఉంటాడు,ఈ వ్యాప్తిచెందే ఈశ్వరుడు యొక్క తత్వము ఎవ్వరికి కంటికి కనపడదు, కంటికి కనపడని వ్యాప్తి చెందే ఈశ్వరుని యొక్క తత్వము గుర్రం రూపం  లో నీకు దర్శనం అయ్యింది నువ్వు భాగ్యవంతుడవు. ఆ గుర్రం మీద కుర్చున్నాడే ఆయనే అగ్ని , ఆయనే పర్జన్యుడు. ఆ గుర్రం రూపం లో ఉన్న అగ్ని ,ఆయనే సమస్త ఫలితములను ఇస్తుంది, కాలమే సమస్త ఫలితములు ఇస్తుంది మృత్యువుతో సహా అదిగో దాని మీద కూర్చున్న వాడు పర్జన్యుడు. ఇంద్ర సఖుడు ఆయన వర్షాన్ని కురిపిస్తాడు , లోక క్షేమాన్ని అంత చూస్తాడు, స్థితి కారుడై శ్రీమహావిష్ణువు గా ప్రవర్తిస్తాడు. అటువంటి మహానుభావ అనుగ్రహం నీకు కలిగింది. అందుకే ఈశ్వర వ్యాప్తి చేత  భయపడ్డ తక్షకుడు నీకు దర్శనం ఇచ్చి నీకు ఆ కుండలములను ఇచ్చాడు . నువ్వు అటువంటి గుర్రం ఎక్కి రాగలిగావు అంటే గురు అనుగ్రహం  పొందిన వాడు, గురుముఖత గా నేర్చుకున్న వాడు, సిద్దుల కొరకు ప్రాకులాడని వాడు , బ్రహ్మ విద్య వశమైన వాడు. వాడు బ్రహ్మము నే దర్శించ గలడు అని ముందు ముందు మహాభారతం లో విశ్వరూప దర్శనం కొంతమందికి అనుగ్రహింప బడితే, గురు వైభవం ఎంత గొప్పదో గురువు ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని శిష్యునకు ఎలా అందించాడో . ఆ పైలుని యొక్క ప్రభావాన్ని , గురు దక్షిణ తేవటానికి శిష్యుడు ఎంత కష్ట పడ్డాడో దానివలన ఎంత అభ్యున్నతిని పొందాడో ,ఎదర ఎదర సాక్షాత్తు శ్రీమన్నారాయణు డే ఆయన ఆశ్ర మానికి వచ్చి దర్శనం ఇస్తాడు. అంత అభ్యున్నతిని
పొందటానికి గురువుకి నమస్కరించడం , గురువుపట్ల మర్యాద తో ప్రవర్తించటం ఎంత అవసరమో చూపటానికి మహాభారతం  మొదట్లో నన్నయ్య భట్టారకుడు , వ్యాసుల వారు మనల్ని కృతర్తులని చేసారు.   




ఆదిపర్వము 5 (ఉదంకోపాఖ్యానం)

మహాను భావుడైన వ్యాసుడు వేదాన్ని విభాగం చేసారు. ఆ వేదాన్ని ఋగ్వేదము , యజుర్వేదము , సామ వేదము , అధర్వణ వేదము అని నాలుగు విభాగాలు చేసారు. ఋగ్వేదాన్ని అంతా తన శిష్యుడైన పైలుడు అనబడే వానికి  ఉపదేశం చేసాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఉపదేశం చేశాడు , సామ వేదాన్ని జైమినికి ఇచ్చారు . అథర్వణ వేదాన్ని సుమంత్రునికి ఇచ్చారు. ఈ  నలుగురు శిష్యుల వలన ప్రశిష్యులు ఏర్పడ్డారు, అంటే ఈ నలుగురు ఆ వేద భాగాన్ని వారి శిష్యులకి చెప్పారు. వేదానికి శ్రుతి అని పేరుఅంటే చెవికి సంబంధించింది అని , అది పుస్తకం చూసి చదువు కుంటే వచ్చేది కాదు. స్వరంతో నేర్చుకోవాల్సింది . అందుకని గురువుగారు చెప్తుంటే ఆ మంత్రభాగాన్ని స్వరం తో పట్టుకుని దానికి తగినట్టుగా ఉచ్చరించ వలసిన స్థితి శ్రవణము వలన వస్తుంది కాబట్టి దానికి శ్రుతి అని పేరు.
వేదవ్యాసుడు వేదాన్ని విభాగం చేసి నలుగురు శిష్యులకి ఇస్తే అది తర్వాతి కాలం లో ఎందరో విద్వాంసులని తాయారు చేసింది. అష్టాదస పురాణాలని సుతునికి ఇచారు. ప్రత్యేకించి భాగవతాన్ని తనకుమారుడైన శుఖ బ్రహ్మ కి ఇచ్చారు, ఇస్తే ఆ శుక బ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి ప్రవచనం చేసారు. కాబట్టి ఆ నలుగురు శిష్యులలో ఒకడైన వాడు పైలుడు. ఆ పైలుడు మహానుభావుడు , విశేషమైన గురు భక్తి తత్పరుడు, ఆయన యొక్క అత్యంత ఉత్తమమైన శిష్యులలో ఒకడు ఉదంకుడు. ఆ ఉదంకుడు గురువుగారికి అత్యంత వినయం తో గురువుగారికి సుసృష  చేసాడు. లోకంలో శిష్యుల్ని అనేక పేర్ల తో పిలుస్తారు, ఆ పేర్లలో ఒకటి వినీయుడు , వినీయుడు అంటే అత్యంత వినయం నేర్చుకున్న వాడు , గురువు పట్ల వినయం తో ఉండు వాడు అందుకే శిష్యుడికి వినీయుడు అని పేరు. 
సిక్కు మతంలో శిష్య అన్న శబ్దమే సిక్కు గా మారింది, వాళ్ళు గురువుగారిని ఎక్కువ గౌరవిస్తరు, ఎక్కువ ప్రేమిస్తారు, అందుకే ఆ మతం లో గురు కి విశేషమైన ప్రాధాన్యత, సనాతన ధర్మం యందు అసలు చెప్పవలసిన అవసరమే ఉండదు "గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షత్త్పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః "
గురుగారుచేత ఉపదేశం చెయ్యబడిన మంత్రము అంగన్యాస కరన్యాసలతో చదువుతున్నప్పుడు ఆ మాత్రం యొక్క అధిష్టాన దేవత యందు మనసు నిలబడ క పోతే , గురువుగారి యొక్క పాద ములు  గుర్తు తెచ్చుకోవటం చేత మీకు సమస్త దేవతలయొక్క అనుగ్రహములు కలుగును . అది గురువు యొక్క శక్తా లేక శిష్యుని గురా  అంటే అన్ని వేళలా గురువుగారి శక్తే అని చెప్పటం కుదరదు. మీకు గురువుగారి మీద ఎంత గురి ఉంటె మీకు గురువుగారి యొక్క శక్తి భాసిచడం ఉంటుంది.

అందుకే రమణ మహర్షి గురువు గురించి మాట్లాడుడు తు శిష్యునికి గురువుగారి మీద ఉన్న గురికే గురువు అని పేరు అంటారు. ఆ గురుత్వము అంటే అదే, గురువు అంటే బరువు. ఆయన కన్నా నేను తక్కువ ఆయన దగ్గర నేను తలవంచాలన్న చిన్నతనము మనం అనుకోవడమే మనము లఘువు, ఆయన్ని గురువు అని   అనుకుoటా మొ అప్పుడు మనము లఘువు , కాబట్టి గురువు బరువు మనము లఘువు అని గుర్తుంచుకోవాలి. గురువుగారు ఏది చెప్పారో అది మనకు శ్రేయోదాయకం అని మనం భావించాలి తప్ప మీకు ఏమి తెలియదు గురువుగారు నేను చెప్తా వినండి అన కూడదు, కాబట్టి ఆ గురుశిష్యుల సంభందం ఎంతో పవిత్రమైనది. గురువుగారిని ఎంతో భక్తి తో సేవించిన శిష్యులు మీకు మహాభారతం లో చాల మంది కనపడతారు. మనం కి చాలా ఆశ్చర్య కరములైన సంభందములు కనపడతాయి.  "శాశితుం యోగ్యః శిష్యః " ఎవరిని గురువుగారు శాశిస్తాడో వాడు శిష్యుడు. ఎవరు శిష్యుడు అవతాడు అంటే శాసించడానికి అనువైన రీతిలో శిష్యుని నడవడి ఉండాలి. గురువు ఒక మాట చెప్తే అది తండ్రి చెప్పిన మాట కంటే గొప్పది. తల్లీ తండ్రీ శరీరాన్ని ఇస్తారు, గురువు మళ్లీ ఈ శరీరాన్ని పొందకర్లేని జ్ఞానం ఇస్తాడు. గురువుగారి తాపత్రయం అంతా ఎలా ఉంటుంది అంటే శిష్యుణ్ణి ఎంత వృద్దిలోకి తీస్కొద్దాం , ఎంత ఆత్మోధరణ కల్పిద్దాం, ఎంత జ్ఞానం సముపార్జించే టట్టు గా అనుగ్రహిద్దాం , దీనితో పాటుగా లౌకికం గా కూడా శిష్యునకి  సమస్త ప్రయోజనములు ఒనగూడే టట్టు గా గురువు ప్రార్ధన చేస్తూ ఉంటారు. గురువు యొక్క మనసు వెన్నపూసలా ఉంటుంది , అందుకని ఎప్పుడూ శిష్యుని యొక్క అభ్యున్నతి కి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాకపోతే గురువుగారి దగ్గర తగిన శిష్యుడు అని పేరు తెచ్చుకోవాలి. అది ఎలా తెచ్చుకోవాలి అంటే. గురువుగారు ప్రేత్యేకించి ఏ ప్రయోజనాన్ని కోరుకునేవాడు కాడు, గురువుగారు  మీరు ఎలా ఉండాలి అని కోరుకుoటుoన్నారో , మీరు అలా ఉండగలగటమే మీరు చెయ్యవలసిన సేవ. రెండవది శిష్యునికి ఛాత్రుడు అని ఒక పేరు చట్రము అంటే గొడుగు , గొడుగు ఏమి చేస్తుంది అంటే గురువుగారు  లేదా వేసుకున్న వ్యక్తి కన్నా పైన ఉంటుంది. నేను ఈయన కంటే గొప్ప అని అనుకోదు, తాను అలా పైన ఉంది పైనించి పడే ఎండా వానా, తన మీద పడేలా చేస్కుని కింద ఉన్న వ్యక్తి ని కాపాడు తూ ఉంటుంది . శిష్యుడు ఏమి చేస్తూ ఉంటాడు అంటే , గురువుగారు డస్సి పోకుండా ఉంటె , సోక్కిపోకుండా ఉంటె తాను ఇంకొంత కాలం ఇంకా బాగా వేదాధ్యయనం, ఇంకా బాగా ఈశ్వరుని సేవకి , ఆయన ఇంకా బాగా గ్రంధ పటనం కొరకు వినియోగిoచుకుంటే, దాని అమృతత్వం కలిగిన ఆ గురువు ఆ   విద్యని మళ్ళి పదిమందికి పంచి పెడతారు, కాబట్టి ఆ గురువు కొన్ని వేలమందికి విద్య అందించేటట్టు గా , ఆయన కి ఎక్కువ సమయం మిగిలేటట్టు గా నేను చెయ్యాలి.
రెండు గురువుకున్న లక్షణం గురువు తన అయుర్ధం తగ్గించేసుకుంటాడు. ఈశ్వరుడు ఊపిరుల రూపంలో ఆయుర్దాయం ఇస్తాడు. దీర్ఘవాఖ్య నిర్మాణం లో , లఘువాఖ్య నిర్మాణం లో లేకపోతే ఎక్కడెక్కడ  వాక్యం విరవాలో అక్కడక్కడ ఊపిరి ఆపి పీల్చి విడిచి పెట్టడo చేత , లోపల ఆ ఊపిరుల సంఖ్యా ఎక్కువై ఆయుర్దాయం క్షీణించిపోతుంది. కనుక ఆయుర్దాయం తనకుతాను క్షీణింప చేస్కున్తున్నాడు తెలిసికూడా. భగవంతుడు మనుష్యునకి ఒక అద్భుతమైన కానుక స్వరపేటిక, ఆస్వరపేటికకి ఒక లక్షణం ఉంది, అది అరిగిపోతుంది. అది కాల క్రమంలో మాట్లాడగా మాట్లాడగా జీర వచ్చి అది మూగబోతుంది. అంటే పనిచెయ్యదు. ఇది తెలిసి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎవరి కోసం  మాట్లాడతాడు.  నేను చెప్పక పోతే నేను చదువుకున్న చదువు ఎందుకు , పోతేపోని స్వరపేటిక, తగ్గిపోతే తగ్గిపోని ఆయుర్ధాయం, నావల్ల పదిమంది బాగుపడితే నాకు అంతకన్నా ఏమికావాలి అని మాట్లాడతాడు గురువు. తన శరీరాన్ని, స్వర పేటికనే త్యాగం చేస్తున్న గురువు మీ నించి ఏమి కోరుకుంటాడు.  ఆయనకి మిగిలిన సమయలలో ఆయన డస్సి పోకుండా నువ్వు చెయ్య కలిగితే, కనీసం ఆయన ఆయుర్ధాయం కొంచం పెరుగుతుంది. కాబట్టి గురువుని  చంపు కోవటం అంటే గురువు ని ఇబ్బంద్ది పెట్టడం. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి నేను అన్వయం చెయ్యట్లేదు. పూర్వ విద్యార్థులు ఆశ్రమాలకి వెళ్లి చదువుకునే వారు అప్పుడు గురుపత్ని అన్నం పెడుతుంది. గురు పత్ని ఏమికోరుకుoతుందంటే, ఆయన  అలానే ఉండాలి తన సౌభగ్యమ్ ఉండాలి అని కోరుకుంటుంది. కాబట్టి గురువు గారి ప్రాణo నిలబెట్టటం లో ఉండే సుసృష గురుపత్ని యొక్క అనుగ్రహానికి కారణం అవుతుంది. గురుపత్ని యొక్క అనుగ్రహం తో సమానమే.
 నన్నయ్య గారు  మహా భారతాన్ని ఆంధ్రీకరిస్తూ , ఉదంకోపాఖ్యానం ప్రారంభం చేస్తూ పైలుడి దగ్గర ఉదంకుడు గురువుగారి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, పైలుడు ఏమి చెప్పాడు ఉదంకుడు ఏమి నేర్చుకున్నాడు అని చెప్తూ గురుకులమునందు గురువుగారికి పరిచర్యలు చేస్తూ , గురుపత్ని కి పరిచర్యలు చేస్తూ , గురువుగారు చెప్పిన దాన్ని వింటూ ఆయన చెప్పినదాన్ని త్రికరణ ఆచరిస్తూ, ఆయన విద్యలు నేర్చుకున్నాడు దానితో పాటుగా అణిమ, గరిమ, లఘిమ  ఇటువంటి అష్ట శిద్దులు ఆయనకి వచేసాయి , ఆయన అనుకుంటే గాలిలో వెళ్ళ  గలడు, ఎక్కడ ఏమి జరుగుతుందో ఆయన తెలుసుకో గలడు , అలా అష్ట సిద్దులు ఆయన కి వశం అయ్యాయి. ఆ అష్ట సిద్దుల కోసం విద్య నేర్చుకోలేదు. కానీ వాటంత అవే వశం అయ్యాయి.
 శంకరా చార్యుల వారు దక్షిణా మూర్తి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు. దక్షిణా మూర్తి స్తోత్రం రొజూ చదువుతూ, ఆ స్తోత్రాన్ని బాగా పరిశీలనం చేసిన వాడికి ఆత్మ ఎరుకలోకి రావడమే కాకుండా, అష్ట సిద్దులు వశం అవుతాయి , కానీ ఈ అష్ట సిద్దులు ఏలాంటివి అంటే కాకి పెంట ఎటువంటిదో , అటువంటివి. ఆత్మ ని తెలుసుకోవటం ప్రధానం కానీ అటువంటి సిద్దుల కోసం వెంపర్లాడటం అతి హేయతిహేయ మైన  విషయం. కాబట్టి ఆత్మ జ్ఞాని వాటినికి చూసి మురిపోడు. అటువంటి స్థితిని ఉదంకుండు పొందాడు , అంతా  గురువుగారి యొక్క అనుగ్రహం వలననే. అష్ట సిద్దుల తో పాటుగా వేద విద్యలను పొందాడు. పొందిన తరువాత ఆశ్రమ నియమం ఒకటి ఉంది, గురువు నిత్య త్రుప్తుడైన  గురువుగారి ని అడుగుతారు , గురుదక్షిణ , గురువుగారు మీరేదైనా కోరండి మేముసమర్పిస్తాంఅని. గురువు నిత్య తృప్తుడు కాబట్టి ఏమి కోరాడు. ఒక్కొక్కచో శిష్యులకి అన్నం పెట్టడానికో ఏదైనా కోరితే కోరచ్చు. పైలుడు ఒక చిరునవ్వు నవ్వి నాకేమి కావలయ్య , ఏమి అక్కర్లలేదు, అప్పుడు ఉదంకుడు గురువుగారి దగ్గర ఇన్ని నేర్చుకుని దక్షిణ ఇవ్వకుండా వెళ్ళ కూడదు, కాబట్టి నేను మీకు ఏమైనా ఇవ్వాలని అనుకుంటున్నాను, మీరేమైనా అడగండి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి  ఊరుకున్నాడు. కాబట్టి ఇప్పుడు గురువుగారు ఏమి మాట్లాడట్లేదు, ఇప్పుడు గురువుగారితో సమానస్థానం ఎవరిదక్కడ , గురుపత్నిది , కాబట్టి ఆమె ని వెళ్లి అడిగాడు ఉదంకుడు. అమ్మ గురువుగారి దగ్గర ఇన్ని నేర్చుకున్నాను , మీరు నాకు అన్నం పెట్టరంమ్మా , నేను గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, ఏమి కావాలమ్మా అని అడిగాడు, ఆవిడ అంది పక్కనే ఉన్నాడయ్యా పౌష్య మహారాజు రాజ్యం చేస్తూ ,ఆ పౌష్య మహారాజు యొక్క భార్య కుండలములను నాకు తెచ్చి ఇవ్వు అన్నది. అలా అడగటానికి కారణం ఏమిటి అంటే
కుండలములు ఐదో తనానికి చిహ్నాలు , అంటే అటువంటి శక్తి కలిగినవి అవి, ఒక్కొక్క వస్తువు కి ఆ శక్తి ఎలా వస్తుంది అంటే ఆ వస్తువుని పట్టుకున్న వ్యక్తి వలన వస్తుంది. గురువుగారి దగ్గర నించి వచ్చిన పూచిక పుల్లకు కూడా శక్తి ఉంటుంది. వారి శక్తి ఆ వస్తువులోకి కొంత వస్తుంది.  కాబట్టి గురువుగారు మహా ఉపాసకులు ,మహా పతివ్రతలు ఇటువంటి వారు ఉపయోగించిన వస్తువులకు తత్సంబంధం మైన శక్తి వస్తుంది.  వివాహం అయిపొయిన టువంటి సువాసినులు పెట్టుకే కుండలములకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. చెవికి కర్ణాభరణం లేకుండా భర్త కి కనపడ కూడదు. ఒకవేళ ఏకారణం చేత నై నా  కర్ణా భరణములు తీసేయ్య వలసి వస్తే, భర్త కి  పరాకు చెప్తారు, అయ్యా కొంచం సేపు ఇటుపక్కకు రావద్దు అని చెప్తారు.  చెప్పి తలుపు మూసేసి, జాగ్రత్త గా కర్ణాభరణంములు తీసేసి, మళ్ళి వెంటనే పెట్టేసుకుంటారు. ఒకవేళ కర్ణాభరణం తీసేసి మరో కర్ణాభరణం పెట్టుకునే మధ్యలో వేరొక ఆభరణo పెట్టుకోటానికి వీలు లేని పరిస్థితి వస్తే ఐదో తనం లో అమ్మవారి యొక్క సాక్షాత్ స్వరూపం కనుక ఒక చిన్న తాటాకు ముక్క అయిన పెట్టాలి తప్ప, చెవులకు ఏమి లేకుండా భర్త కు ఆడది ఎట్టి పరిస్తితులలో కనపడ కూడదు.నిషిద్దం. ఎందుకంటే అది భర్త యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంది అని చెప్పినవి శాస్త్రాలు.  పౌ ష్య మహాదేవి ఆవిడ అంత పతివ్రత, ఈయనే నాకు ఈశ్వరుడు అని భర్తకి ప్లేటులో ఇడ్లీ పట్టుకొచ్చి ఇస్తే పరమేశ్వరుడికి బాలభోగం చేసిన ఫలితం ఆమె ఖాతా లో వేస్తాడు. అందుకే ఆడదానిగా తరించడం తేలిక పురుషుడిగా తరించడం చాల కష్టం నిజానికి, అందునా భర్త విశేషమైన భక్తి తత్పరుడైతే, ఆయన చేసే పూజలలో సగం వంతు భార్య ఖాతా లో పడిపోతుంది, ఆవిడా ఇంకొంత చెస్కుదనుకోండి, ఈయన కన్నా ఆవిడ  పుణ్యమే  ఎక్కువ  ఉంటుంది  నిజానికి.
పౌష్య మహాదేవి అంత పతివ్రత , భర్తని అంత గా అనువర్తించింది. ఆయన పుష్యాభిషేకాన్ని పొందాడు కాబట్టి పౌష్యుడు అని పేరొచ్చింది ఆయనకి. కాబట్టి అటువంటి పతివ్రత యొక్క కుండలములకు ఆ శక్తి ఉంటుంది , కాబట్టి ఆ కుండలములు అడిగి తెచ్చి పెట్టు అన్నది. ఇప్పుడు గురువు గారు ఒప్పుకోవాలా. గురువు నిశబ్దం గా ఉంటె గురువుపత్ని ఆజ్ఞ గురువుగారి ఆజ్ఞే. ఇక్కడ మహాభారతం ఏమి చెప్తుంది అంటే, గురు గారితో సమానం గా సేవించాలి అని చెప్తుంది.
ఇప్పుడు ఆవిడ తీసుకురా కుండలములు అంటే ఆయన బయలు దేరాడు. ఎంతో దూరం కాదు. దగ్గరలో నే ఉంది పౌష్యుని రాజ్యం. ఆ వెళ్తుండగా ఒక ఆశ్చర్య కర సంఘటన జరిగిoది. ఒక దివ్య పురుషుడు, మనుష్య తేజస్సు తో పోల్చలేని తేజస్సు తో ఒక వ్యక్తి, ఒక ఎద్దు మీద కూర్చొని ఉన్నాడు. మాములు గా ఉన్న ఎవరో ఒక వ్యక్తి ఒక ఎద్దు మీద కుర్చుని దీని పేడ తిను అంటే ఛా అవతలికి పో అంటాడ లేదా , కాని ఆ వ్యక్తి దివ్య మైన తేజస్సు తో ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క తేజస్సు చూడగానే ఆయన చుట్టూ ఉన్న వలయం చూడగానే, ఈయన సామాన్యుడు కాదు , ఈయన మనుష్యుల కన్నా బిన్నమైన జాతికి చెందిన వాడు. దేవతా స్వరూపుడు ,కాబట్టి ఈయన మాట నేను అవుదల దాల్చాల్సిందే అనే టటు వంటి ప్రచోదనం కలిగే టట్టు ఆయన ఉన్నాడు. స్వభావము గురువుగారి మాటలు విన్నందు వలన వచ్చిన వినయాన్ని మింగేస్తుంది. అప్పుడు తన స్వభావం తో ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఆ దివ్య తేజస్సు కలిగిన వ్యక్తి వంక చూసాడు. ఆ వ్యక్తి   ఇది గో  నేను ఎక్కిన ఎద్దు పేడ వేసింది. ఈ పేడ  కొద్దిగా తిను అన్నాడు. తిన్నాడు. ఆయన దివ్యత్వం అంగీకరించి నప్పుడు,ఆయన ఎందుకు అంత గొప్పగా ఉన్నాడో తెలియదు కానీ గురువుగారిని అడుగుదాం తరువాత, ప్రస్తు తానికి  ఆయన మాట విందాంఅని కాస్త పేడ తీస్కొని తినేసాడు. ఆ బయలు దేరు. వెళ్ళిపోయాడు.  తర్వాత పౌష్య  మహారాజు దగ్గరకి వెళ్ళాడు. పౌష్య మహారాజు అడిగాడు ఏమిటి దేనికి వచ్చావు అని అడిగాడు, అప్పుడు ఉదంకుడు అన్నాడు నేను గురుదక్షిణ ఇవ్వటానికి బయలు దేరి వచ్చాను అన్నాడు. మా అమ్మ వంటి గురుపత్ని నీ భార్య యొక్క కుండలములు అడిగింది అన్నాడు.
ఇవచ్చా రాజు అంటే రాజుకి రెండు కర్తవ్యములు ఉంటాయి. ఒకటి
ఆశ్రమం లో విద్యాభ్యసించి బ్రహ్మ చర్యం విడిచి పెట్టి గృహస్తాశ్రమం లో కి వెళ్లేవా డికి పెళ్లి ఖర్చు పెట్టుకోవాల్సిన భాద్యత రాజుదే. నిజమైన స్నాతకము అంటే అప్పటివరకు కాటుక పెట్టుకోకూడదు, అప్పటివరకు తల దువ్వుకో కూడదు, అప్పటివరకు పూల దండ వేస్కోకూడదు తాంబూలం తినకూడదు, అద్దం చుస్కోకూడదు. ఇన్ని నియములు పాటించిన వాడు అన్ని విడిచి పెడతాడు. ఇవన్ని పాటించిన వాడు బ్రహ్మ చర్యం విడిచి పెట్టి గృహస్తాశ్రమం లోకి వస్తాడు. గురువుగారి కి గురుదక్షిణ ఇవ్వవలసి వస్తే , ఏముంటుంది శిష్యుని దగ్గర ఏముంటుంది, ఇవ్వటానికి అందుకని రాజు దగ్గరకి వెళ్తాడు. రాజా నేను ఇవి చడువుకున్నాను, ఇప్పుడు నేను గురుదక్షిణ ఇవ్వాలి అంటాడు , ఏది నువ్వు చదువు కున్న వాటిలో రెండు మాటలు చెప్పు అంటాడు, చెప్తే  శేభాష్ వీడు బాగా చదువుకున్నాడు వీడికి గురుదక్షిణ కట్ట దానికి డబ్బు ఇవ్వండి అంటదు. రాజా నేను గృహస్తాశ్రమం లోకి వెళ్తున్నాను , బ్రహ్మచర్యం విడిచిపెట్టి అంటాడు అప్పుడు రాజు అయితే ఇదిగో ద్రవ్యం ఇస్తున్నాను వెళ్లి పెళ్లి చేస్కో అంటాడు. కాబట్టి గురుదక్షిణ కోసం రాజుని ఆశ్రయించాలి కాబట్టి ఆ గురుదక్షిణ తన భార్య కుండలములే అయినా రాజు తన ధర్మం తాను నెరవేర్చాలి, మహా భారతం అంతా ధర్మమే మాట్లాడుతుంది. కాబట్టి రాజు ఇప్పుడు తన భార్య కుండలములను పట్టుకు వెళ్ళు అని చెప్పాలి, ఆవిడ తన భర్త ఏది చెప్తే అది చేస్తుంది పతివ్రత, ఆవిడ ధర్మం ఆవిడ చెయ్యాలి.  ఇప్పుడు భర్త చెప్పాడు కాబట్టి ఇచ్చెయ్యాలి, కాబట్టి పట్టుకెళ్ళు అన్నాడు రాజు. నువ్వు  వెళ్లి అడుగు ఆవిడ ఇస్తుంది అన్నాడు రాజు. ఇప్పుడు పౌష్య ని యొక్క భార్య , రాణిగారి  యొక్క అంతఃపురం  లోకి వెళ్ళాడు , అలా వెళ్ళో చ్చా , అంటే ఆయన చదువుకున్న వేదం అటువంటిది . ప్రతి ఒక్కరికి ఐదుగురు తల్లులు ఉంటారు, ఐదుగురు తల్లుల్లో రాజు భార్య ఒకతె.  గురువుగారికి గురుదక్షిణ కట్టటానికి వచ్చిన వాడు , గురుదక్షిణ కట్టటం అంటే చదువు పూర్తి అయ్యింది.  చదువు పూర్తైన వాడికి ఏమి తెలిసి ఉండాలి దేశాన్ని ఏలే రాజు భార్య తల్లితో సమానం. రాణి వాసం లోకి వెళ్లి చుస్తే మాత్రం బిడ్డడు తల్లిని ఎలా చూస్తాడో అలా చూస్తాడు . కాబట్టి ఇప్పుడు రాణి వాసం లో కి వెళ్లి చుస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి. ఒక గురువు దగ్గర చదువుకున్న వాడి మీద రాజుకి అంత గౌరవం ఉండేది. సంస్కారం చదువు ఎంత విడదీయ్య రానివిగా ఉండేవో భారతం చెప్తుంది. సంస్కారం లేని చదువు ఈ జాతి ఊహించలేదు.  సంస్కారం లేని విద్యావంతుడు "జ్ఞాన ఖలుని లోని శారద వోలె" ఉంటాడని ఊహించలేదు.
ఇప్పుడు ఉదంకుడు రాణివాసం లోకి వెళ్ళాడు . రాణిగారు ఏరి అని అడిగాడు, రాణివాసం లో అదిగో గదిలో కూర్చున్నారు అన్నారు వెళ్లి మాట్లాడు అన్నారు. వెళ్లి చూసాడు కనపడలేదు. అదిగో అక్కడే ఉన్నారు అంటారు పరిచారికలు. వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నా ఆసనం కనపడుతుంది, ఆవిడ కనపడట్లేదు. అదేవిటి కనపడట్లేదు ఇందులో ఏదో మాయ ఉంది. ఇప్పుడు ఆవిడ కనపడక పోతే ఎవరిని వెళ్లి అడగాలి, ఆయన్ని అడగాలి కాబట్టి తిన్నగా రాజుగారి దగ్గరకి వెళ్లి మహారాజా! నేను రాణివాసం లో మహారాణి వారికోసం వెతికాను నాకు కనపడట్లేదు అన్నాడు. ఎట్లా కుండలములు తీస్కొని వెళ్ళను అని అడిగాడు. అప్పుడు మహారాజు ఓ భూవినుత! నువ్వు అన్ని గురువుగారిదగ్గర చదువుకున్న వాడివి , అందరిచేత గురవింప బడ వలసిన వాడివి, నేను నిన్ను ఒక మాట అనకూడదు , నువ్వు అపవిత్రుడవు అని నేను అనకూడదు కానీ నీవు అపవిత్రం గా ఉన్నావు అన్న విషయం నువ్వు తెలుసుకోవటానికే  నేను వెళ్లి రాణిగారి దగ్గర కుండలాలు తీస్కో అన్నాను. ఎందుకు అన్నానో తెలుసా అవి పవిత్రమినవి అయిత్ర్ అవి పుచ్చుకునే వాడివి నువ్వు ఎలా ఉండాలి , నువ్వూ పవిత్రం గానే ఉండాలి. నువ్వు పవిత్రంగా లేనప్పుడు , పవిత్రమైన వాటిని పుచ్చుకోవటానికి నీకు ఏమి అర్హత ఉంది. అని నేను అనచ్చా , అనకూడదు అందుకని నేను అనలేక పోయను. కానీ నీకు ఒక విషయం చెప్తున్నాను విను నా భార్య మహా పవిత్రురాలు , మహా పతివ్రత , సౌచము లేనివారికి కనపడదు, నీకు సౌచమ్ లేదు , కాబట్టి కనపడలేదు. అందుకని నువ్వు సౌచుడ వై వెళ్ళు, అప్పుడు ఆయన ఆలోచించాడు నాకు ఎక్కడ సౌచమునకు అంతరము వచ్చింది , అప్పుడు ఆయన కి గుర్తు కు వచ్చింది ఆ.. పేడ తిన్నాను. ఆచమనం చెయ్యలేదు.
స్నానం చేసే వీలు లేనప్పుడు ఎక్కడకైన ముఖ్యమైన పనికి వెళ్ళవలసి వచ్చిన ప్పుడు ఒకసారి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని ఒక్కసారి ఆచమనం చెయ్యాలి, ఆచమనం చేస్తే మళ్ళి సౌచమ్ మొదలు అవుతుంది . నేను ఆచమనo చెయ్యలేదు పేడ తిన్న తరువాత, అక్కడ వచ్చింది నాకు అసౌచమ్ అని అనుకుని వెంటనే కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కొని మూడుమార్లు ఆచమనం చేసాడు.  ఆ ఆచమనం చెయ్యడానికి కారణం అందుకు వచ్చింది. అది లోపలి సౌచన్ని తీస్కువచ్చి పెడుతుంది, బాహ్య సౌచమ్ స్నానం వలన వస్తుంది. ఇప్పుడు ఆయన తిన్న పదార్ధము వలన అసౌచమ్ ఎదిఅయితే  ఉందొ అందువలన ఆవిడ కనపడలేదు.  అంటే ఆచార కాండ యొక్క ప్రాముఖ్యం నన్నయ్య గారు మనకి పెద్ద పీట వేసి చూపిస్తున్నారు. ఆచమనం చేసి వెళ్ళాడు , వెళ్ళగానే ఆ పౌష్య మహారాణి కనపడింది. ఆవిడ అంది నాయన ! ఇదిగో కుండలములు అడిగావ్ , గురుదక్షిణ గా ఇస్తాను అంటున్నావ్ , ఇదిగో తీస్కెళ్ళు, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, తక్షకుడు అనే ఒక సర్పరాజు ఉన్నాడు , ఆయన మహాబలవంతుడు ,మాయావి ఎప్పటినించో ఈ కుండలములను తస్కరించాలని కోరుకుంటున్నాడు, ఎందుకు తస్కరించ లేక పోయాడు, పరమ పవిత్ర, పతివ్రతా అయిన నేను ఉన్న చోటికి ఎలా రాగలదు , అపవిత్రమైన ఆలోచనలు ఉన్న వాడు, రాలేడు . ఇప్పుడు నువ్వు పట్టుకెళ్తున్నావ్ , చూసావా గబుక్కుని లోపలకి వచ్చావ్ , ఆచమనం చెయ్యకుండా. అలా ఏమాత్రం నీదగ్గర దోషం వచ్చిన వీటిని తీసుకుపోతాడు. తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా నేను ఇచ్చను కుండలములు, నీవు నీ శ్రద్దని నిలపలేక పోవటం చేత , గురుదక్షిణ చెల్లించలేని వాడివి అవుతావు. చాలా జాగ్రత్త గా వెళ్ళు అని పరాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు చాల సంతోషం గా ఆ కుండలాలు తీస్కున్నాడు. రాజుగారి దగ్గర కి వెళ్లి ఇంక సెలవు తీస్కుంటాను అని చెప్పాడు. రాజుగారు అన్నారు  నాయన చాలా దూరం నించి వచ్చావు , వేళ దాటి పోయింది, మద్యాహ్నం అయ్యింది , కాస్త భోజనం చేసి బయలు దేరు . బ్రహ్మచారి వి ఇంటికి వచ్చావు.
బ్రహ్మ చారి , సన్యాసి వీళ్ళిద్దరూ ఆహరం కొరకు గృహస్తు మీద ఆధారపడతారు. కాబట్టి గృహస్తు యొక్క ధర్మం ఏమిటంటే వాళ్ళిద్దరికీ బిక్ష పెట్టాలి. తాను గృహస్తు పిలిస్తే తింటాను అన్నాడు.  కాబట్టి కూర్చున్నాడు భోజనం అంతా పెట్టారు. భోజనం మొదలు పెడుతుంటే అందులో ఒక తల వెంట్రుక వచ్చింది.
లోకం లో దేని వెంట్రుకా పవిత్రం కాదు ఒక్క ఏనుగు వెంట్రుక వినా, ఎనుగ వెంట్రుక కి ఉన్న శక్తి ఎమితన్తెఅది ద్రుష్టి దోషాన్ని తీసేస్తుంది.
కాబట్టి ఆయన భోజనం లో వెంట్రుక చూసాడు. వెంట్రుక అనేది అత్యంత హేయము , ఉత్తర క్షణం లో ఆ పదార్ధాన్ని విసర్జించ వలసి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది అంటే అర్థాకలి తో లేచి పోయాడు , బ్రహ్మ చారి ఉత్తరాపోసన పట్టేయాలి. ఆ పదార్థము తినకూడదు , అది దూష్యము తింటే. బ్రహ్మచారి అర్థాకలి తోలేచి పోతే బాధ కదండీ.పిల్ల వాడు కదు , ఆకలి శ్రద్ద తో పెట్టొద్దు అన్నం పెట్టినప్పుడు, ఇప్పుడు అర్థాకలితో లేచిపోయను, ఒకసారి లేచి పోయాను మళ్లి ఎప్పుడో సాయంత్రం తింటాను , ఎంత దూరం నడవాలి ఈ ఆకలి తోటి, ఎంత ఇబ్బంది పెట్టావ్ నన్ను. ఆయన కి కోపం వచ్చి నీకు ద్రుష్టి పోవుగాక అన్నాడు పౌష్య మహారాజుని. అనగానే పౌష్యమహారాజు అన్నాడు నీవు బ్రహ్మ చరివి నేను గృహస్తుని , నీకు భోజనం పెట్టడం నా ధర్మమే , నేను వండా నా లేక కావాలని వెంట్రుక వేసి పెట్టాన , పొరపాటున వెంట్రుక వచ్చింది "సర్వేంద్రియానం నయనం ప్రధానం " ద్రుష్టి ఎంత ముఖ్యం , ద్రుష్టి లేనివాడు రాచరికం ఏమి చేస్తాడు. ఇప్పుడు నాతో పోలేదు , మొత్తం రాజ్యమే సంకట స్థితిలోకి వెళ్ళింది. నీకు వచ్చిన కోపానికి నువ్వు నన్ను మాత్రమే శిక్షించలేదు అమాయకమైన ప్రజల ను కుడా శిక్షించావు, ఇది పౌష్యు డి  యొక్క హృదయం. ఇప్పుడు నువ్వు పరిధి దాటావు కాబట్టి, నీకు శాప వాక్కు ఇవ్వాలి. నీకు సంతానము కలుగకుండు గాక అని శపించాడు. ఇప్పుడు ఏమైంది పుస్తకాలు చదువుకున్నాడు , ఋషి ఋణం తీరింది. యజ్ఞాలు చేస్తాడు, హోమాలు చేస్తాడు దేవతల ఋణం తీరింది. సంతానము కలుగదు పితృ  ఋణం తీరదు. ఒక ఋణం ఉండిపోయిన వాడికి స్వర్గ లోక ద్వారం కూడా చూడలేడు. ఉన్నత లోకాలు పొందలేడు. నువ్వు నన్ను అంత దూరం తీస్కేళ్ళావు కాబట్టి నిన్నింత దూరం తీస్కెళ్ళాను. కాబట్టి ఇద్దరిలో స్వభావాలు బయటకి వచ్చాయి.  ధర్మం లేదు అనుకోకండి ఉంది. స్వభావము అనేది దుందుడుకు గా రజోగుణ తమోగుణ ప్రకోపం తో ధర్మాన్ని నొక్కేసి  అంత దూరం తీస్కెళ్ళి పోతుంది. నువ్వు చదువుకున్న చదువు నిన్ను ఉన్నత లోకాలని చేరనివ్వదు. వాక్కు యొక్క శక్తి ఎంతో గొప్పది . తపశ్శక్తి ఉన్న వాడు తొందర పడి  శాప  వాక్కు విడిచి పెడితే అవతల వాడు ఎంత బాధ పడవలసి ఉంటుందో కూడా తెలిసి ఉండాలి లేదా అంత తపో నిష్టా గరిస్టు లైన వారి నోటి వెంట ఇలాంటి వాక్కు వచ్చింది అంటే దాని వెనక ఏదో బలీయ మైన కారణం ఏదో తరుము కుంటూ వచ్చి ఉండోచ్చు.
కాబట్టి నీ శాపవాక్కు ఉపసంహారం చెయ్యి అన్నాడు పౌష్య మహారాజు , నేను ఉపసంహారం చేస్తాను , నువ్వు నీ శాపాన్ని ఉపసంహారం చెయ్యి అన్నాడు ఉదంకుడు. అప్పుడు రాజు స్వభావము గురించి మాట్లాడాడు. త్రికరణ సుద్ది గా స్వభావాన్ని గురించి మాట్లాడే వాడు ఉండడు. పైకి ఒకలా ఉంటాడు లోపల ఇంకోలా ఉంటారు . స్వభావము చెప్పడం చాల కష్టం.
బ్రాహ్మణుల మనసు నవనీతం లా ఉంటుంది , అప్పుడే తీసిన  వెన్న ముద్ద లా ఉంటుంది. పలుకో చాల కఠినమ్ గా ఉంటుంది. మాట అలా మాట్లాడాడు అంటే , అవతల వారిని దిద్ద డానికే మాట్లాడుతాడు తప్ప , వారి స్వభావం చాల మంచిది, అమృత హృదయులు బ్రాహ్మణులు. వాక్కు క ఠి నంగా వచ్చినా మళ్ళి దాన్ని తిప్పి అనుగ్రహిచ గలిగిన
 గుణం బ్రాహ్మణుడికి సహజం గా ఉంటుంది . రాజుయందు మాట మధురంగా ఉంటుంది ,మనసు వజ్రంలా కాఠిన్యము తో ఉంటుంది. మాట మంచిగా ఉన్నా మనసు కఠినo కాబట్టి తియ్యలేడు శాప వాక్కు. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడివి కాబట్టి నువ్వు తియ్యి  తియ్యలేను అన్నాడు.  













Sunday, May 11, 2014

ఆదిపర్వము 4

మహాభారతానికి ఒక గమత్తు ఉంది, మొట్టమొదట ఒక కుక్క తో ప్రారంభం , చిట్ట చివర మళ్ళి ఒక కుక్క, మధ్యలో మహాభారతాన్ని ఒక మలుపు తిప్పింది ఒక కుక్కే, ఏకలవ్యుడు కుక్క నోట్లో ఐదు బాణాలు కొట్టి ఉండక పోతే భారతం ఒకలా ఉండేది, మహాభారతానికి కుక్క పాత్రకి అంత దగ్గర.  రామాయణం లో ఎప్పుడూ కుక్క మాంసం గురించి ప్రస్తావన వస్తుంది.  విశ్వామిత్రుడికి కి కోపం వస్తే చాలు  "కుక్క మాంసం తినే వాళ్లై బతకండి అంటూ ఉంటాడు .
కాబట్టి జనమేజయుడు యాగం దగ్గరకి ఒక కుక్క వచ్చింది. కుక్కకి ఒక లక్షణం  ఉంటుoది. కుక్క ఇంట్లో ఉండకూడదు అనడం లేదు, ఉండొచ్చు కానీ రాజద్వారం కనుక దాటి వచ్చింది అంటే, మీ ఇంట్లో ఉండే దేవతలు ఆ రోజు ఉపవాసం ఉండిపోతారు. దేవతలు ఉపవాసం ఉన్నటువంటి క్షోభ యజమా ని ని ఏప్పుడో అప్పుడు కట్టి కుడుపుతుంది. అది జాతక చక్రం చుస్తే తెలిసేది కాదు, ఆ ఉపాసన బలం ఉన్నవాళ్ళకి తెలుస్తుంది. 

ఎందుచేత అంటే శృంగ గిరికి పీఠాధిపత్యం చేసారు, చంద్రశేకరేంద్ర భారతీ స్వామివారు, ఆయన దగ్గరకి ఒక రోజు ఒకాయన వచ్చాడు, వెళ్లి  దిగులుగా కూర్చున్నాడు, ఆయన(చంద్రశేకరేంద్ర భారతీ స్వామివారు) మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమి అలా కూర్చున్నావ్ ? ఏమి చేస్తూ ఉంటావ్ అన్నారు ? "నేను రొజూ సాల గ్రామాల్ని ఆరాధన చేస్తూ ఉంటాను అన్నాడు " ఆయన అన్నారు "మీ ఇంట ఉన్న సాలగ్రామాలలో ఒకదాన్ని మీ నాన్న  గారు జీవించి ఉన్నoతకాలం, వేరుగా పూజ చేసి దానికి పెద్ద నైవేద్యం పెడుతూ ఉండేవారు, మీ నాన్న గారు శరీరం విడిచి 
పెట్టాక దానికి నువ్వు వేరు పూజ చేస్తున్నావా కొడుకు గా ? ఈయన ఏమి చెప్పలేదు ఆయనకి , అదే దివ్య ద్రుష్టి అని మనవి చేసేది.  ఆయన అన్నాడు "నిజామే మీరు ఎలా గ్రహించారో తెలీదు మా నాన్న గారు ఒక సాలగ్రామాన్ని ప్రత్యేకం గా పూజ చేసేవారు, వేరే వాటితో కలప కుండా , పూజ చేసి దానికి వేరే పెద్ద నైవేద్యం పెడుతూ ఉండేవారు.  మా నాన్న గారు చనిపోయి న తరువాత నేను ఆ సాలగ్రామాన్ని మిగత వాటిల్తో కలిపేశాను. అన్నిటికి కలిపి కాసిన్ని నీళ్ళు పోసేసి అన్నిటికి కలిపి నైవేద్యం పెడుతున్నాను. అప్పుడు చంద్రశేకరేంద్ర భారతీ స్వామివారు అన్నారు అందుకే నువ్వు బాధలో ఉన్నావ్ , ఆ సాలగ్రామం నృసింహ సాలగ్రామం అందుకే దాన్ని అన్నిటి తో కలిపి పూజ చెయ్యటానికి లేదు. దానికి వేరుగా పూజ చెయ్యాలి , దానికి వేరుగా  మహా నైవేద్యం  వేరుగా కొంచం  ఎక్కువగా పెట్టాలి, దాని యొక్క ఆకలి ఎక్కువ.  నువ్వు ఆ విధం గా చెయ్యక పోవటం వాల్ల , నీ ఇంట పూజా మందిరమున, నృసింహా సాలగ్రామం యొక్క వ్యధ నిన్ను కట్టి కుడుపుతుంది. అందుకు  నీ వ్యధ, ఇంటికి వెళ్లి నృసింహ సాలగ్రామం వేరుచేసి, వేరుగా పూజ చేసి వేరుగా నైవేద్యం పెట్టడం మొదలు పెట్టూ అన్నారు. ఆరధాన తెలిసి ఉండాలి . సరిగా ఉండాలి . విగ్రహం ఎంత ఉండాలో తెలిసి ఉండాలి . పెద్దలనడిగి పూజా మందిరం లో పెట్టుకోవాలి. ఇంట ఆకలితో ఉంటె ఎంత ప్రమాదం వస్తుందో. సీతమ్మ తల్లి ఏడుస్తూ కూర్చుంటే, ఆ కన్నీటి బిందువు భూమి మీద పడితే భూమి అంతా కాలి పోతుంది . ఆ కన్నీటి బిందువు కి కారణమైన రాక్షసులని నాశనం చేస్తుంది. ఆ కన్నీటి బిందువే అగ్ని హోత్రం గా తీస్కొని వెళ్లి పెట్టారు, ఆంజనేయ స్వామి , అంతే లంక కాలిపోయింది. ఒక్కొక్కరి బాధ , క్షోభ , కన్నీటి బిందువు కట్టి కుదిపెస్తాయి. ఒక్కొక్క దోషం జాతక చక్రానికి కూడా అందేది గా ఉండదు.  అటువంటి దోషాన్ని పట్ట గలిగిన వారు , మహాత్ములైన వారు మాత్రమే తమ అంతర్ ద్రుష్టి తో చూసి చెప్తారు. అది సాధ్యం అయ్యే పని కాదు అటువంటి మహాత్ములు అన్ని వేళలా  లభ్యమై మన గురించి మాట్లాడటానికి అవకాసం ఉన్దోచు ఉండక పొవచ్చు . కాబట్టి చేసే పని జాగ్రత్త గా చెయ్యాల్సి ఉంటుంది. 
కాబట్టి మహా భారతం లో ఒక కుక్క గురించి ప్రస్తావన చేసారు అంటే అంత తేలికగా మీరు స్వీకరించ కూడదు. కుక్క పరమ పవిత్రమైన ప్రాంగణం నందు ప్రవేసించ రాదు అది మీ పెంపుడు కుక్క అవ్వొచ్చు, మీరు భారతం వినడానికి రావొచ్చు , దానికి  వాకింగ్ అయిపోతుంది అని దాన్ని పట్టుకు గుళ్ళోకి  రాకూడదు. అది దోష భూయిష్టం, దాన్ని పట్టుకుని జనులు తిరగని చోటకి తీస్కుని వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఆ యజ్ఞ ప్రాంగణాని కి ఒక కుక్క వచ్చింది, అది దేవశూని , దేవతల కుక్క, కానీ కుక్క కుక్కే కదండీ, కాబట్టి యజ్ఞశాల  లో ప్రవేశం చేస్తుందేమో, యజ్ఞ భూమి యందు అది తిరుగాడితే, యజ్ఞ భూమి అపవిత్రం చేస్తుందేమో అన్న భావన చేత, ఈ జనమేజయుని తమ్ముళ్ళు, వాళ్ళు సాక్షాత్తు క్షత్రియులు రాజ కుమారులు, గొప్ప పరాక్రమము ఉన్నవారు శ్రుత సేనుడు , ఉగ్ర సేనుడు, భీమసేనుడు అని ముగ్గురి పేర్లు వెళ్ళు ముగ్గురు కలిసి ఆ దేవతల యొక్క ఆడ కుక్క సరమ అనే కుక్క యొక్క కొడుకు, ఒక చిన్ని మగ కుక్క పిల్ల సారమేయము దాని పేరు, దాన్ని కొట్టారు, ముగ్గురూ కలిసి కొట్టి తరిమారు. తరిమితే అది ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరకి వెళ్ళిపోయింది,అది ఆమెతో చెప్పింది "అమ్మ నేనేమి యజ్ఞ శాల లోకి వెళ్ళలేదమ్మా, ఏమిటి జరుగుతోంది అని అక్కడ ఇలా నిలబడి చూస్తున్నాను,జనమేజయుని ముగ్గరు తమ్ముళ్ళు వచ్చి నన్ను తరిమి తరిమి కొట్టారమ్మా నా వొళ్ళంతా హూనం అయిపొఇందమ్మా" అని ఏడ్చింది. ఇప్పుడు ఆ దేవశూని సరమ బయలు దేరి వచ్చింది, ఈలోగా యజ్ఞం పూర్తి అయిపొయింది, ఆయన కూర్చొని ఉన్నాడు జనమేజయుడు, ఆయన దగ్గర కి నేరుగా వెళ్లి "ఓ  క్షితినాధా ! ఓ భూమిని పరిపాలించే ప్రభువా , దయలేని వారై  నీతమ్ములు వివేకమునకు దూరంగా బతుకుతున్న వారు ఆలోచించక , నా కొడుకు చిన్ని కుక్క , అదేమీ దోషం చెయ్యలేదు అది ఎవ్వరిని  ముట్టుకోలేదు , దూరం నించి చూసింది అలా చుసిన కారణానికి , ముగ్గురు కలిసి నీ తముళ్ళు వెంటాడి వెంటాడి కొట్టారు అది దెబ్బలతో బాధ పడుతూ నా దగ్గరకి వచ్చింది.  రాజా నీకు ఒక విషయం చెప్పి వెల్లిపోదాం అని వచ్చాను, నీ తమ్ముళ్ళు కొట్టారని కాని , వాళ్ళని శిక్షించమని చెప్పను , కానీ ఒక్క మాట చెప్తా విను, ఈపని చెయ్యచ్చు ఈపని చెయ్య కూడదు అని మనస్సులో ఆలోచన చెయ్యకుండా భగవంతున్ని నమ్ముకుని బ్రతికే సాధులకు , బలహీనులైన వారి దగ్గర బలహీనులు కదా వాళ్ళేమి చేస్తారులే అని వాళ్ళ జోలికి వెళ్ళినా ఒక  ఫలితం ఉంటుంది రాజా అదేమితో తెలుసా కారణం లేని  భయం కలుగుతుంది. కారణమునకు దొరక కుండా వస్తుంది సుమా .ఇది గ్రహించుకో రాజా " అని వెళ్లిపోయింది కుంక. రాజు పురోహితున్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అన్నారు వ్యాస భగవానుడు , నన్నయ్య గారు. ఇది బాహ్యానికి చుస్తే అర్థం అయ్యీ అవ్వకుండా ఉన్నట్టు ఉంటుంది. దీనినే ఉత్కంఠ అంటారు.  అంటే ఏమైందో తెలుసుకోవాలని.  
మహాభారత ప్రారంభం లో వ్యాస భగవానుడు, నన్నయ్య గారు  ఒక మనుష్యేతర  పాత్ర ని ప్రవేశపెట్టారు.  ఉత్కంఠ కంఠo  ఇలా ఎత్తి చుసేట ట్టు గా మనలో ఒక రకమైన ఉత్సాహాన్ని , తెలుసుకోవాలి అనుకునే తతువంటి జిజ్ఞాస ని పెంచారు. ఎత్తిన కంఠo ఎప్పుడు దించాలని వాళ్ళ ఉద్దేశం అంటే 18 దో పర్వం ముగిసేవరకు, అప్పటికి నీకు ధర్మం మొత్తం తెలిసిపోతుంది.  తండ్రి తాపత్రయ పడ్డట్టు తాపత్రయ పడతారు ఋషులు , అందుకు మనం రుణ పడి పోయాం వాళ్ళకి.    ఇక్కడ  ఆoతర్యం ఏమిటంటే, కుక్క సాధు జంతువు, తనంత తాను మీద పడిపోయి కరిచేయ్యదు,యజమానిని నమ్ముతుంది , మీరు ప్రేమతో దాని దగ్గరకి వెళ్లి నిలబడితే, అది తోక ఊపి సంకేతిస్తుంది. లోకం లో కొన్ని  ప్రాణులు మీ మీద ప్రేమతో ఉన్నాయో లేదో తెలియదు, కానీ ప్రేమతో ఉన్నాయో లేదో తెలిసే జంతువులూ కొన్ని ఉన్నాయ్ అందులో కుక్క ఒకటి. దానిని తరమాలంటే చై అని ఒక అరుపు అరిస్తే పోతుంది. దానికొరకు ముగ్గురు రాకుమారులు  కోట్టాలటండి. ఇంతటి బలపరక్రమములు ఉన్న చంద్ర వంశం లో పాండవులకు వారసులుగా జన్మించిన వాలు , జనమేజయుని  సోదరులు ఒక కుక్క పిల్లని సిగ్గి లేకుండా తరుముతారా? ముగ్గురు రాజుల ఎదుట ఒక కుక్కపిల్ల ఎదురు నిన్చుంటుంది అని మీరు ఊహించ గలరా వెంటనే పారిపోతుంది.  ముగ్గురు రాజులు ఒక్కొక్కరు ఒక్కొక వైపు నించి, పారిపోవటాని కి కుడా  చోటు లేకుండా కొడుతుంటే , అది నన్ను వదిలిపెడితే బావుండు ,కుయ్యో కుయ్యో అని ఏడుస్తు పారిపోతే, ఏదో సాధించామని బహు సంతోషము తో యజ్ఞ శాల లో కూర్చున్న వాళ్ళని ఈశ్వరుడు ఎందుకు క్షత్రియుడిగా పుట్టించాడో ఆ బల పరక్రమలతో ఎవరిని రక్షించాలో తెలియక, ఎవరితో  యుద్దం  చెయ్యాలో  తెలియక అల్ప ప్రాణుల మీద పరాక్రమము చూపిన నీకు ఆ కుక్క ఎంత ఏడ్చిందో, ఆ ఏడుపు యొక్క ప్రతి ఫలం గా కారణం లేని ఆపద వస్తుంది. కారణం లేకుండా ఇంత బలం చుపించావ్ కాబట్టి. రాజా కట్టి కుడుపుతాయి, నీకు చెప్పే వాడు లేడు , నిన్ను ఎప్పటికప్పుడు దిద్దేవాడు వాడు లేడు , ఉంటె ఇలా జరిగి ఉండేది కాదు , ఇది ఆ కుక్క హృదయం.  అందుకని దెవశూని అల అన్నది.
ఈఘట్టం మహాభారతం లో ఆ నాటిది అని అనుకోకండి, మీరు సమాజం లో ఎప్పుడు ఎక్కడికి వెళ్లి నిలబడండి , ముగ్గురు మధ్య ఉంటారు. ఒకటి మీకన్నా తక్కువ వాళ్ళు , రెండు మీతో సమానులు , మూడు మీకన్నా అధికులు. నీకన్నా తక్కువారు కనబడితే కలియబడటం , అధికారుల దగ్గర నించి ఉంటుంది ఈ  స్థితి ఆ నాటి నించి ఈనాటి వరకు ఉంది. నీకన్నా బలహీనులు కనబడితే కలియబడకూడదు. నీతో సమానులు కనబడితే , వీడు వృద్ధి లోకి రావాలి అని కోరుకోవాలి. నీకన్నా అధికుడు కనపడితే ఈర్ష్య పడకూడదు, వారు ఎంత సాధన చేస్తే ఈ స్థితి కి వచ్చి ఉంటారో , వారిదగ్గర తెలుసుకుని నేను కూడా ఆ స్థితి ని పొందాలి అనుకోవాలి. పెద్ద వారిని చూసినప్పుడు వచ్చే అసుయ్యని పూజ్య భావన తో గెలవాలి. సమనుడి తో వచ్చే ఉదాసీనత ని వీడు ఇంకా వృద్ధి లోకి రావాలన్న ప్రేమతో గెలవాలి , నీకన్న తక్కువ  వా డి ని చూసినప్పుడు వాడుకుడా ఒకనాటికి ఈశ్వరుని అనుగ్రహం తో గొప్ప స్థితి ని పొందుతాడు, వాడిని గౌరవించడం చేత నేను ఈ స్థితి లో నిలబడ గలను తప్ప వాడిని అగౌరవ పరిస్తే నేను దిగజారి పోతాను అని తెలుసుకొని  ఉండాలి.   ఈ మూడు లేని  జీవితo అకారణం గా ఆపదల్ని తెచ్చి పెడుతుంది. అప్పుడు బాధ పడటం కన్నా నీజీవితన్ని దిద్దుకో, నీ ప్రవర్తన ని దిద్దుకో , నీ నడవడి దిద్దుకో , నువ్వు భూతముల (ప్రాణులు)పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్చుకో . నువ్వు భూతముల పట్ల ప్రేమతో , ముగ్గురి పట్ల ఎలా పరావతిo చాలో అల ప్రవతించడం నీకు వస్తే నీకు కారణం లేని ఆపదలు రావు. కారణం ఉన్న ఆపద అంటే, చేసిన కర్మకి ఫలితం ఉంటుంది. ఎప్పుడో తెలియక చేసావ్ ఫలితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలుసుకుని నడుచుకున్తున్నావు కాబట్టి  పాము కరవ వలసిన వాడికి చీమ తో కరిపించి వదిలి  పెట్టేస్తాడు ఈశ్వరుడు. ఇప్పుడు వాడు మారాడు , భక్తి తో ఉన్నాడు కాబట్టి నేను చనకను అంటదు. నీ ప్రవర్తన మార కుండ నువ్వు ఈశ్వరుని మీద బిల్వ దళాలు వేసినంత మాత్రానా ఈశ్వరుడు నిన్నుకరుణిస్తాడు అని  అనుకోకూడ దు , ఆ బిల్వ దళాలు ఆయన  సృష్టి లోవే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దానికి నీ ప్రజ్ఞ ఏమి లేదు, నీకు పుణ్యం ఇవ్వటానికి ఆయన నీ చేత ఇప్పించాడు అంతే. అందుకే బలవంతుడైన వాడు ఎవరిపట్ల ఆ బలాన్ని ప్రదర్శించాలి అంటే బలహీనులైన వారిని చనకుతున్న వాళ్ళని నిగ్రహించడానికి ఉపయోగించాలి తప్ప ,బలహీనులని చండాడటానికి ఉపయోగించ కూడదు. నీకు జీర్ణమయ్యే శక్తి ఉందికదా అని అదేపనిగా తినకూడదు , నీ శరీరానికి ఎంత కావాలో అంతే పుచ్చుకోవాలి . నీకు  నోరు ఉంది కదా అని ఏది  పడితే  అది మాట్లాడ కూడదు, ఏది వేదం ని సమర్థిస్తుందో అదే మాట్లాడాలి.
కాబట్టి "జనమేజయ తగినంత కారణం లేకుండా నీ బలాన్ని ఉపయోగించావు కాబట్టి కారణం లేని ఆపద వచ్ఛి పడుతుంది , నీవు గుండెలు బాదుకుంటావు.  నేను కాదు కదా చేసింది అనుకుంటున్నా వేమొ , "క్షితినాధ" నీ రాజ్యం ఎవరు చేసినా నీ మీదకే వస్తుంది. నీకు ఈ వ్యవస్థ ని చక్క దిద్ద వలసిన పూచి నీ మీద ఉంది , చంద్ర వంశం లో పుట్టావు ధర్మత్ముడివి నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తున్నాను , నేను ఊరుకోవచ్చు కానీ ఆపద వస్తుంది , ఇంకా ఇంకా ఇలాంటి తప్పులు జరగకుండా నాలుగు మంచి మాటలు చెప్తే , మంచి వాడవైతే వింటావు , విని మార్చుకునే సంస్కార బలం నీకు లేకపోతే , అహంకారం అడ్డు వచ్చి తిరగాబడతావు. అది నీ పతనానికి హేతువు  అవుతుంది కాబట్టి నువ్వు ఏమి చేస్తావో నీ   ఇష్టం, నీ సంస్కారానికి వదిలేస్తున్నాను అంది .
పైకి చెప్పకుండా పూర్తి చేసి ,ఇంత చిన్న పద్యాన్ని మాత్రమే చెప్పి , ఇంత చిన్న పద్యాన్ని అనగా  ఒక గొప్ప సూక్తిని,
అది ఆ నాటి జనమేజయుడికే కాక ఆ నాటి నుండి ఈ నాటి వరకు సనా త న ధర్మం లో ఉన్న మనందరికీ కుడా హితమును చెప్పటమే, అందుకే మహాభారతం లో చెప్పని ధర్మం లేదు. భూత కారుణ్యము కన్నా ధర్మం ఈలోకం లో లేదు, అందుకే మొట్ట మొదట మహాభారతం మొదలు పెడుతూ ఈ భూతకారుణ్యం కి సంబంధించిన  ఘట్టం తో ప్రారంభం చేసారు.
 జనమేజయుడు పురోహితుణ్ని అన్వేషిస్తూ  బయలుదేరాడు, పురోహితుడు అన్న పదమునకు అర్థం ఏమిటంటే, పురము యొక్క హితం కోరే వాడు. రాజు ప్రజా సంక్షేమాన్ని కోరి తన భుజ బలం తో రాజ్యాన్ని రక్షిస్తాడు. పురోహితుడు రాజు , రాజుని ఆశ్రయించిన వాళ్ళు తప్పులు చెయ్యకుండా, ఆ తప్పుల రరూపం లో రాజుకి ఆపద , ప్రజలకి ఆపద రాకుండా ఎప్పటికప్పుడు రాజు యొక్క నడవడిని పరిశీలించి, ఎప్పటికప్పుడు కారణం చెప్తూ , మర్పులుచేపుతూ , జరగరాని దోషం జరిగితే, రాజు వరకు కూడా తేకుండా , ప్రాయశ్చిత్త కర్మలు ఆచరించి , తానూ గొప్ప   భక్తు డై  నిరంతరం ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ అగ్ని హోత్రం లో హవిస్సులు ఇస్తూ , హోమ కార్యం చేస్తూ పురం యొక్క హితము కొరకు తన తపస్సుని ధర పోసి , ఆ అక్షతలు పట్టుకువచ్చి "లోకా సమస్తా సుఖినోభవంతు "అంటూ సింహాసనం మీద కూర్చున్న రాజు మీద వేసి వెళ్తూ ఉంటాడు. అటువంటి పురోహితుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ రాజు వలన  తెలిసి కానీ తెలియక కాని చిన్న చిన్న అపరాధములు జరిగినా అవి సద్దుకుని విజయం కలుగుతుంది . అది పురోహితుని గొప్పతనం.
నేను యజ్ఞ శాల లో కూర్చున్నాను , ఇలా జరిగింది , సరమ వచ్చి చెప్పేదాకా నాకు తెలియదు, ఇలాంటివి జరగ కూడదు అంటే , నా చాటున కూడా , సరియైన మాటలు చెప్పే ఒక పురోహితుడు కావలి. ఇప్పుడు పురోహితున్ని వెత్తు కో వటా నికి , ఏ మంత్రి నో పిలిచి పురోహితుణ్ణి  చుడండి అనలేదు. తానూ బయలుదేరాడు. తనకి అత్యంత ముఖ్యమైన విషయం లో వ్యక్తిగత శ్రద్ద పెట్టాలి , పెట్టి తాను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరుని పల్లకి పట్టుకున్నపుడు పదిమందినీ పిలవాలి . నీకు ఆకలి వేసినప్పుడు నువ్వు మాత్రమే అన్నం తినాలి. ఆకలి వేసినప్పుడు అన్న తినడం ఎంత ముఖ్యమో నీ ఇంటి పురోహితున్ని ఎంచుకునే తప్పుడు నువ్వు శ్రద్ధ పెట్టటం అంత ముఖ్యం. కొన్ని కొన్ని విషయాలలో నువ్వు వ్యక్తి గతమైన శ్రద్ధ పెట్టక పోతే ఆ విషయానికి అర్థమే ఉండదు. తన తండ్రి శరీరం విడిచి పెట్టేస్తే శ్రాద్ధం తానే పెట్టాలి దానికి కి కూడా వరుడు ఇచ్చేస్తాను అనకూడదు.  కాబట్టి  భారతం నించి మనం ఏమి నేర్చుకుంటున్నాము అంటే అన్నిపనులు అస్తమానం అందరికి అప్ప చెప్పేవి కావు ,  కొన్ని మనం చెయ్యాల్సినవి మనం చేస్కోవాలి.
కనుక జనమేజయుడే పురోహితున్ని వరించడానికి బయలు దేరాడు. ఒక నదీ తీరం దగ్గర కి   వెళ్లి చూస్తున్నాడు. ఎందుకు వెళ్ళాలి నదీ తీరం దగ్గరకి అంటే , ఎక్కడ నది ఉన్నదో ఆ నదీతీరం దగ్గర పర్ణ శాల లు వేస్కుని ఉంటారు, ఎందుకని అంటే మూడు సంధ్యల లో ఆ పవిత్ర నదిలో స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకుని ఉంటారు. నీరు ఎక్కడ  ఉంటుందో అక్కడే  ధర్మ  కార్యాచరణ సాధ్యం అవుతుంది. అందుకే బాలకాండ లో రాముడు విశ్వామిత్రుడి తో కలిసి వెళ్తే , గురువర్యా ఇక్కడ నది ప్రవహిస్తుంది , మీరు ఇక్కడ ఉండండి అంటాడు. కాబట్టి నదీ  తీరం లో ఉంటారు అనుష్టానం తెలిసున్న వాళ్ళు . వాళ్ళ మనసులు పరిపక్వమై , వాళ్ళు చేసిన సత్కర్మల చేత రాజుని రాజ్యాన్ని మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు.  ఎందుకని కోరుకుంటారు అంటే, ఒక్కొకరికి ఒక్కొక్క లక్షణం క్షత్రియుడు మంచం మీద చచ్చి పోకూడదు భూమి మీద చచ్చి పోకూడదు అన్నది శాస్త్రం. ఆయన యుద్ద భూమి లో చనిపోయిన నాడే ఆయన జన్మ కు సార్ధకత అంది , ఆయన  మాంసం  తినొచ్చు, ఎందుకు తినొచ్చు , ఆయనకీ బలం ఉండాలి, నేను భారతం కాలం నాటి విశేషాలని వివరణ చేస్తున్నాను. నేను అల యుద్దాలు ఇప్పుడు చెయ్యమని చెప్పట్లేదు. మాంసం తిను దోషం లేదు. రామచంద్ర మూర్తి తిన్నారు, ఎందుకు తిన్నారు , బలంగా ఉండాలి , ఇప్పుడు ఈ బలం ఎందుకు ఉపయోగించాలి , బలహినున్ని చనకుతున్న బలవంతుణ్ణి    ని గ్రహించటానికి ఉపయోగ పడాలి. పురోహితులు ఎప్పుడూ ఏమి కోరుకుంటూ ఉంటారు అంటే బలవంతుడై , ధర్మాత్ముడై , యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ప్రజలని రక్షించాలని కోరుకునే రాజు పది కాలాలు బతికి ఉండాలని కోరుకుంటారు.
కాబట్టి అయ్యా తెలిసో తెలియకో అపచారములు జరుగుతున్నవి కనుక మీరు వచ్చి మాకు మంచి చెడులు చెప్పవలసింది అని అడిగినప్పుడు రాగలిగిన హృదయ సంస్కార బలం కలిగిన వాడు అక్కడ ఉంటాడు అని వెతుక్కోవాలి.  ఎక్కడ ఏది వెతుక్కోవలో అది వెతుక్కోవాలి. ఒక వస్తువు కోసం వేరొక చోట వెతుక్కో కూడదు కదా. కాబట్టి నది వొడ్డుకి వెళ్ళాడు. అంటే ఏ మహాత్ములు ఉండేచోట ఎక్కడ ఎలా ప్రవర్తించాలో , ఎక్కడ వెతుక్కోవలో , ఎలా మాట్లాడాలో ,  దేని వలన నీవు అభ్యున్నతిని పొందుతావో , నీకు దొరికే వస్తువు నీ జన్మని ఎలా తరిమ్పచేస్తుందో ఒక్కొక్క నాడు మహా భారతం మీకు వివరణ చేస్తుంది. నాకు వివరణ చేస్తుంది.



ఆయన అక్కడ ఉండేటటువంటి మునిపల్లె అంటే అక్కడ ఎవ్వరు కూడా సౌకర్యముల తో కూడిన ప్రాంగణము లు కట్టుకున్న వారు ఉండరు , రక్షణ వ్యవస్థ ధీటుగా ఏర్పాటు చేసిన వి ఉండవు, రాతి తో చేసిన నిర్మాణములు కాని , మట్టిని కాల్చి చేసిన నిర్మాణములు కాని వాళ్ళకి ఉండవు. పల్లెటూరు అన్న చోట చుడండి అన్ని పాకలు పందిళ్ళే ఉంటాయి. వైదికము గా  ఉంటాయి అన్ని. సనాతన ధర్మం లో మట్టిని కాల్చటం దోషం , కాల్చిన మట్టితో చేసిన ఇంటిలో ఉండడం అంతకన్నా దోషం . అందుకే పూర్వం అందరు ఏమి చేసేవాళ్ళంటే వెదురు బద్దలు నాటి పచ్చి మట్టిని కలిపి, ఆ పచ్చి మట్టిని మెత్తి గోడలుగా చేస్కొని , ఇప్పుడు పిట్ట  గోడ  లంత  ఎత్తు కట్టుకుని, దాని లోపలకి తొంగి చుస్తే ఏమి ఉండవు ఎత్తుకు పోవటానికి , ఆయన బాగా వేదం చేప్పిన చోట ఇచ్చిన పెద్ద అంచు పంచ ఒకటి ఆరేసుకుని మురిసిపోతుంటాడు, ఆయన దగ్గర కుడా ఎత్తుకుపోవటానికి   ఒకడు వచ్చాడనుకోండి. దొంగ రూపం లో ఈశ్వరుడు వచ్చాడని మురిసిపోతాడు. కాబట్టి ఆయనకి పెద్దగా రక్షణ వ్యవస్థ అక్కర్లేదు. దండెం మడిబట్ట , పెరట్లో నది , ఇంట్లో వెదురుతో చెయ్యబడిన పూజ మందిరం దాని మీద ఈశ్వరుడు. ఆయనకి నాలుగు కుండలు వాటిలో నీళ్ళు , ఒక ఆవు దాని పాలు, పెరుగు, నెయ్యి. అరణ్యం లో ఉండేవాళ్ళు పంతులు గారు అభిషేకం చేస్కొండి అని తీస్కొచ్చి ఇచ్చిన తేనే.  దొరికిన రెండు పళ్ళు . గుండె నిండా ఈశ్వరుడు. వాళ్ళు సంతోషం గా  పిట్ట గోడ అంత ఎత్తు మట్టి , దాని మీద వెదురు కర్రలు  పైన ఆకులతో అచ్చాదన, చుట్టూ దేవుని యొక్క మూర్తులు , అదంతా చక్కగా సున్నంతో పెట్టిన ముగ్గులు, ఇంటి ముందంతా ముగ్గులు , చుట్టూ కట్టిన తోరణాలు , ఎంత అందంగా ఉందొ వింటుంటే మనము అల ఉంటె బావుండు అనిపిస్తుంది. మునిపల్లె అంటే వారు    అటువంటి వైదిక జీవనం ఉన్న వారు. అనుస్టాపర్యంతం ధర్మము నందు ఉండే వారు. రాజు యొక్క హితము కొరకు తన యొక్క మoత్ర శక్తిని ధారా పొయ్య కలిగిన వాడు, పురము ఒక్క హితమును కోరువాడు అయిన వాడిని అక్కడ జనమేజయుడు వెతుకుతున్నాడు. వెతకగా వెతకగా శ్రుత స్రవాసుడు అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆయనకి లభించాడు. ఆయన కుమారుడు ఉన్నాడు , ఆయన పేరు సోమస్స్రవసుడు, కుమారుడు దిట్ట గొప్ప బలం ఉన్న వాడు , మంచి తపస్వి, తండ్రి కాదని కాదు , తండ్రికన్నా గొప్ప వాడు. తండ్రి ఎప్పుడూ కోరుకునేదేంటి అంటే , కొడుకు చేతిలో ఓడిపోవాలని , నాన్న గారికి తెలిసిన వైదిక ధర్మం కన్నా ధర్మం తెలియడం . అటువంటి కొడుకుని కాని మురిసిపోతున్న వాడు లోక హితము కొరకు దానం చేయు వాడు అటువంటి హృదయం ఉన్న వాడు. ఇప్పుడు తండ్రి దగ్గరకి వెళ్లి అడగాలి . నీవు ఏదైనా పెద్దగా మాట్లాడిన చిన్నగా మాట్లాడినా పెద్దల దగ్గర మాట్లాడాలి , పిల్లల జోలికి వెళ్ళకూడదు.
రామచంద్ర మూర్తి శివ ధనుస్సు భంగం చేసేయ్యగానే , జనకుడు నీళ్ళు పట్టుకుని వచ్చేసాడు, కన్యాదానం చేసేస్తాను అయ్యా శివ ధనుస్సు భంగం చేసేసావ్ కదా అన్నాడు. అంటే రాముడు అన్నాడు నేను క్షత్రియున్ని కాబట్టి శివ ధనుర్భంగం చేశాను, నువ్వు పిల్లని ఇస్తానంటే పుచేస్కోవటానికి నేను శివధనుర్భంగం చెయ్యలేదు, నువ్వు పిల్లని ఇస్తే ఏమవుతుంది నాకు పత్ని అవుతుంది. నాకు పత్నిగా నిర్ణయం చెయ్యవలసింది నేను కాదు నువ్వు కాదు, నాకు పత్నిగా ఎవరు ఉండాలో నిర్ణయించ వలసిన వాడు నా తండ్రి దశరధ మహారాజు , నేను ఇక్కడ ఉంటాను , మా నాన్న గారికి కబురు పంపించు , మా నాన్న గారికి చెప్పు నీ వంశం గురించి , ఆయనకి సంతోషం కలిగితే వస్తారు, వచ్చి స్నాతకం చేసి రామా స్వీకరించు సీత ని పత్నిగా అంటారు , మా నాన్న గారు అన్నారా పాణిగ్రహణం చేస్తాను. మీరందరూ చెప్పి మా నాన్న గారు అనలేదా నేను స్వీకరించను వదిలేస్తాను . నన్ను చది వించిన వాడు నాకు విద్యా బుద్దులు నేర్పినవాడు , విశ్వామిత్రుడు వచ్చి అడిగితే ఏడ్చిన వాడు,నామీద ఇంత ప్రేమ కలిగిన వాడు , నాకు ఎవరు భార్య గా వస్తే నేను సంతోషిస్తానో తెలియని వాడా ? నేనెందుకు స్వతంత్రించాలి , ఇవ్వడానికి నువ్వు ఎవరు పుచ్చుకోవటానికి నేను ఎవరు , మా నాన్నకి కబురుచేయ్ మా నాన్న చెప్తే నేను పుచ్చుకుంటాను అన్నాడు. ఎక్కడి ధర్మం అక్కడే.
కాబట్టి ఇప్పుడు జనమేజయుడు ఆ పిల్లవాని దగ్గరికి వెళ్లి నువ్వు నాకు పురోహితుడిగా రా అని అనకూడదు. తండ్రి గారిని వెళ్లి అడగాలి అయ్యా మీ అబ్బాయిని మా ఇంటికి పురోహితుడిగా పంపండి అని. ఎంత ధర్మమో చుడండి , ఎంత గొప్పగా ఉంటుందో చుడండి . కాబట్టి ఇప్పుడు జనమేజయుడు వెళ్లి సృత్స్రవసున్ని
" యమనియములు అనే గొప్ప అష్టాo గ  యోగములు తెలిసున్న వాడు , ఇంద్రియములను నిగ్రహించినటు వంటి వాడు , అపారమైన తపసంపత్తి కలిగిన వాడు పరమ నైస్టి కములైన జీవితము గడుపుతున్న వాడు . నియమములను పాటించు వాడు, నిత్య  నైమిక్తిక  కర్మలను నెరవేర్చేవాడు, వేద ప్రమాణములను పూర్తిగా నమ్మిన వాడు , భగవత్భక్తి కలిగిన వాడు, నిరంతరమూ జప హోమములను చేసేటటు వంటి వాడు ,అటువంటి మీ కుమారుడు మాకు పురోహితుడు గా వస్తే నా వంశం నిలబడుతుంది, నాకు రక్షణ కలుగుతుంది , నాకు రక్షణ కలిగితే నేను లోకానికి రక్షణ కల్పించ గలుగుతాను,కాబట్టి నాకు రక్షణ ఇవ్వగల్గిన వాడు నీ కొడుకు " ఇది విశ్వాసం అంటే , ఇది మాత్రం మీద నమ్మకం అంటే , ఇది వేదం మీద నమ్మకం అంటే "కాబట్టి నాకు నీ కొడుకుని కరుణిచి అనుగ్రహించ వలసినది" ఈలోకం లో ఏదైనా ఇస్తారు కన్న కొడుకుని "ఎవ్వరిస్తారు . "కాబట్టి నా మీద  దయతో ప్రేమతో నీ పుత్రుణ్ణి ఇవ్వవయ్య అని అడిగాడు . ఆయన చాలా  సంతోషించి , ఇది త్యాగం అన్న మాటకి అర్థం . నా కొడుకు యొక్క తపస్సు , నాకొడుకు యొక్క హోమం ,జపం నిజంగా నీ అభ్యున్నతికి ఈరాజ్యం రక్షణ కి పనికి వస్తే ఇంతకన్నా ఏమి కావలి ఇది  నోటితో అనక్కర్లేదు ఇది  సృత్స్రవసు ని యొక్క భావన . ఆయన  వెంటనే కుమారుణ్ణి పిలిచి నాయన ఇదిగో జనమేజయ మహారాజుతో బయలుదేరు, ఆయనకి పురోహితుడిగా ఉంది రాజుని రాజ్యాన్ని కూడా కాపాడు నీయొక్క వైదికమైన అనుష్టానం తో రక్షించుఅని జనమేజయునితో పురోహితునిగా పంపించాడు. పురోహితునితో కూడిన జనమేజయుడు సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు.